Nothing phone 2A: నథింగ్ నుండి కొత్త ఫోన్ వచ్చేసింది.

A new phone came out of nothing.

Nothing phone 2A: నథింగ్ నుండి కొత్త ఫోన్ వచ్చేసింది.

స్మార్ట్ ఫోన్ లవర్స్ కి ఇది నిజంగానే అద్భుతమైన వార్తా అని చెప్పొచ్చు. నథింగ్ కంపెనీ(Nothing) ఇప్పటివరకు నథింగ్ ఫోన్ 1(Nothing Phone 1) అలాగే నథింగ్ ఫోన్ 2(Nothing Phone2) ను ప్రవేశపెట్టాయి, అయితే ఇప్పుడు తాజాగా మరో ఫోన్ ను నథింగ్ కంపెనీ లాంచ్ చేయబోతోంది.

అదే నథింగ్ ఫోన్ 2 ఏ(Nothing Phone 2A). ఈ ఫోన్ ను ఒక మహత్తరమైన వేదికగా లాక్ చేయాలనీ యోచిస్తోందట ఆ కంపెనీ, అదేమిటంటే 2024 ఫిబ్రవరి(2024 February)

నెలలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(Mobile Congress) అనే సందర్భాన్ని పురస్కరించుకుని ఆ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇంకా ఈ కొత్త మోడల్ పాత రెండు మోడళ్ల కన్నా అడ్వాన్స్ గా ఉండబోతోందిని తెలుస్తోంది.

డిస్ ప్లే(Display) :

120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ (120HZ Refresh Rate)తో అమోలెడ్ స్క్రీన్(AMOLED Screen) ఉండనుంది అంటున్నారు,

1084 x 2412 పిక్సెల్ రిసొల్యూషన్(Pixel Resolution) కూడా ఉంటుందట. అలాగే దీని స్క్రీన్ సైజు విషయానికి వస్తే 6.7 ఇంచెస్ ఉండటమే కాకుండా అమోలెడ్ డిష్ ప్లే తో వస్తుందట.

ప్రోసెస్సర్(Processor) :

ఇందులో ఎస్ ఓ సి(SOC) ఆధారిత 7200 మీడియాటిక్ డైమెన్సిటీ చిప్ సెట్ ను అందిస్తుందని లీకుల ద్వారా తెలుస్తోంది.

ఇది మొబైల్ కు మంచి స్పీడ్ ను అందిస్తుందని చెబుతున్నారు. కస్టమర్ కి మంచి అనుభూతి వస్తే తప్పకుండ మంచి ఇంప్రెషన్ దక్కుతుంది అని ఏ కంపెనీ అయినా భావిస్తుంది.

కెమెరా (Camera):

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లో ఎంత ఎక్కువ మెగా పిక్సెల్ తో కెమెరా ఉంటె దానికి అంత ఎక్కువ డిమాండ్ ఉంటోంది. ఇక ఈ మోడల్ లో కెమెరా విషయానికి వస్తే ముందువైపు 50 మెగా పిక్సెల్(50 Mega Pixel) అల్ట్రా వైడ్ కెమెరా అమర్చారు,

ఈ కెమెరా శాంసంగ్ యస్5కేజేఎన్1(S 5KJN 1) అల్ట్రావైడ్ కెమెరా అని తెలుస్తోంది. ఇక వెనుకవైపు చుస్తే 32 మెగా పిక్సెల్(32Mega Pixel) సోని IMX615 సెన్సార్ తో వతుందట.

ధర (Price):

అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ధర, మన భారత దేశంలో చూసుకుంటే దీని ధర 33,000 రూపాయలు(₹33,000) పలుకుతుంది అని అంచనా వేస్తున్నారు.

ఇందులో 8జిబి ర్యామ్(8GB RAM) తో పాటు 128 జిబి(128 GB) ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ ఈ ఫోన్ లో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం కొద్దీ రోజుల వ్యవధిలోనే సదరు కంపెనీ పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంటుంది.

Leave a Comment