Redmi Note 13R Pro: కొత్త ఫోన్ వచ్చేస్తొందోచ్.. ఇది ఎన్ని మెగాపిక్సెలో తెలుసా..దీని ధర చుస్తే టెంప్ట్ అవ్వకుండా ఉండలేరు..
ఇవాళ్టి రోజుల్లో సెల్ ఫోన్ కొనే వారు ప్రతి ఒక్కరు అందులోని ఫీచర్లు ఏమున్నాయి, ఎటువంటి టెక్నాలని ఉంది అనేది చూడటానికి ముందు ఆ సెల్ ఫోన్ లో కెమెరా ఎన్ని మెగా పిక్సెల్ కలిగి ఉంది అని చూస్తున్నారు. అందుకే సెల్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఫోన్లలో ఎక్కువ మెగా పిక్సెల్ కెమెరా ఉండేలా చూసుకుంటున్నాయి. ఫీచర్ల గురించి చెప్పే క్రమంలో ముందు వరుసలో ఉంచుతున్నారు ఈ కెమెరా డీటెయిల్స్. ఎందుకంటే మన ఫోన్ లో అధునాతమైన మంచి కెమెరా ఉంటె రకరకాలు గా ఫోటోలు తీసుకోవచ్చు, అదే విధంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకోవచ్చు.అందుకే మొబైల్ లాంచ్ చేసే సమయంలో కంపెనీలు ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఎక్కువ మెగా పిక్సెల్ ఉన్న వాటిని కూడా తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తున్నాయి కంపెనీలు. మార్కెట్ లో ఉన్న ఈ పోటీని ఎదుర్కొనే క్రమంలో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రెడ్‌మీ ఓ బడ్జెట్ ఫోన్‌ను దించేయబోతోంది. రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో పేరుతో వస్తున్న ఈ ఫోన్ లో కెమెరాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారట. రెడ్‌మీ ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. కానీ ఇంటర్నెట్ లో మాత్రం ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని బట్టి ఆ ఫోన్ లో ఫీచర్లు ఏమున్నాయో ఒక లుక్కేయండి, రెడ్‌మీ నోట్13ఆర్ ప్రో స్మార్ట్ ఫోన్‌ను 6.67 ఇంచెస్‌తో కూడి డిస్‌ప్లే ఉండేలా రూపొందించారు. హోల్ పంచ్‌తో కూడిన స్క్రీన్ దీని సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఇది పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందిస్తున్నారట.
సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉందనున్నట్టు తెలుస్తోంది. చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ 1999 యువాన్లు పలికే అవకాశం ఉందట. మరి మన ఇండియన్ కరెన్సీ లో చుస్తే 23,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో వస్తున్న ఈ ఫోన్ ధర భారత్ లో మరింత తగ్గే అవకాశం కూడా ఉందని అంటున్నారు టెక్ నిపుణులు.