Breaking News

A new producer from Mega Compound : మెగా కాంపౌండ్ నుండి కొత్త నిర్మాత తెరపైకి.

anil 1 1 A new producer from Mega Compound : మెగా కాంపౌండ్ నుండి కొత్త నిర్మాత తెరపైకి.

A new producer from Mega Compound : మెగా కాంపౌండ్ నుండి కొత్త నిర్మాత తెరపైకి.

మెగా కాంపౌండ్ నుండి కొత్త నిర్మాత తెరపైకి వస్తున్నారు. అయితే ఈ సారి ఫిమేల్ ప్రొడ్యూసర్ వస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు మెగా బ్రదర్ నాగబాకు కుమార్తె నిహారిక.

ఆమె నిర్మాణ సంస్ధపేరు పింక్‌ ఎలిఫెంట్‌. అయితే నిహారిక పింక్‌ ఎలిఫెంట్‌ ను ఇప్పుడు కొత్తగా ఏమి ప్రారంభించలేదు. ఈ పింక్‌ ఎలిఫెంట్‌ పతాకంపై ఆమె ఇప్పటికే షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెబ్ సీరీస్ నిర్మించారు.

తన అభిరుచికి దగ్గరా ఉండే కధలకు దృశ్యరూపం ఇస్తూ ముందుకి వెళుతున్నారు నిహారిక. కానీ ప్రస్తుతం ఇదే నిర్మాణ సంస్థపై ఫ్యూచర్ ఫిలిం తెరకెక్కించదలుచుకున్నారు.

అయితే తాను నిర్మించబోయే సినిమాలో అందరు కొత్తవాళ్లే ఉంటారని చెప్పారు. దానిని ఒక బాధ్యతగా తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ఈ కొత్త సినిమా పూజా కార్యక్రమాలను చాలా గ్రాండ్ గా నిర్వహించారు మెగా డాటర్. ఈ ఈవెంట్ కి కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కూడా హాజరయ్యారు.

వారిని చూసిన మెగా ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఈ జంట తొలిసారిగా ఈ ఈవెంట్ లోనే బయటివారికి కనిపించారు.

మెగా బ్రదర్ నాగబాబు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిహారిక సోదరుడు వరుణ్ తేజ్ క్లాప్‌ కొట్టారు కొట్టారు. మెగా కాంపౌండ్ నుండి కేవలం నిహారిక మాత్రమే లేడి ప్రోడ్యుకేర్ కాదు.

తాజాగా చిరంజీవి గారాల పట్టి సుస్మిత కూడా ప్రొడ్యూసర్ కాబోతున్నట్టు తెలుస్తోంది. సుస్మిత తన తండ్రి చిరు హీరోగా సినిమా చేయబోతోందట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *