రష్యా – ఉక్రెయిన్ యుద్ధం లో తెలంగాణా యువకుడు మృతి

ac355d1c 826f 4fd3 bb09 1dfa6dd85028 రష్యా - ఉక్రెయిన్ యుద్ధం లో తెలంగాణా యువకుడు మృతి


నగరానికి చెందిన అస్ఫాన్ అనే యువకుడు దుబాయ్ కి చెందినా ఒక ఏజంట్ చేతి లో మోసపోయాడు. ఇక్కడ నుండి వెల్లిన యువకులు ” బాబా వ్లాగ్స్ ” అనే యు ట్యూబర్ కి తమ గోడును చెప్పుకున్నారు. తమను ఎలాగైనా కాపాడాలని భారత కాన్స్యులేట్ ని వేడుకున్నారు. దుబాయ్ లో ఉద్యోగ నిమిత్తం కొంత మంది యువకులు దుబాయ్ వెళ్ళారు. దుబాయ్ లో ఉండే ఏజంట్ ఫైసల్ వారికి ఇంకా ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలికాడు.

ఇక్కడ కన్నా రష్యాలో అయితే ఇంకా ఎక్కువ జీతం వస్తుంది అని ఇక్కడ చేసేదే అక్కడ చెయ్యాలి అని నమ్మేటట్లు వారిని ఒప్పించి అందుకు వారి వద్ద కొంత సొమ్ముని కుడా తీసుకుని వారిని రష్యా పంపాడు. కాని వారికి విజిటర్స్ వీసా ఇచ్చి రష్యాకు పంపాడు అని విచారణ లో తేలింది. అయితే అక్కడ అధికారులు వారిని సరియైన పత్రాలు లేవని అరెస్ట్ చేసారు. మేము ఇక్కడ సెక్యురిటి గార్డు గా జాబు చెయ్యడానికి వచ్చామని ఎంత్ చెప్పిన వారు వినలేదు.

పైగా ఏవో పత్రాల మీద సంతకాలు తీసుకున్నారని చెప్పారు. అక్కడికి వెళ్ళిన యువకులను ఉక్రెయిన్ లో ఆర్మీ లో కి బలవంతం గా చేర్చుకుని పని చేయిస్తున్నారని ఇక్కడి యువకుడి తండ్రి నయీం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఒక యువకుడు చనిపోయాడని మాకు వార్త వచ్చింది ఆయన చెప్పారు. అస్ఫాన్ మరణం విష్యం నిజమే అని MIM చీఫ్, ఎంపి అసదుద్దీన్ ఒవైసి చెప్పారు, ఈ విషయం వారి కుటుంబ సబ్యులకు కూడా తెలియచేసామని ఆయన అన్నారు.

Leave a Comment