Amir khan son in law wedding in gym dress: జిమ్ డ్రెస్లో పెళ్లి..అమీర్ ఖాన్ అల్లుడా మజాకా.

Add a heading 2024 01 04T164416.882 Amir khan son in law wedding in gym dress: జిమ్ డ్రెస్లో పెళ్లి..అమీర్ ఖాన్ అల్లుడా మజాకా.

Aamir khans son-in-law: బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమీర్‌ ఖాన్‌ (Aamir Khan)కూతురు ఇరా ఖాన్‌ (Ira Khan)పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఇరా ఖాన్ ,

నుపుర్ శిఖరే (Nupur Shikhare) ముంబైలో వారి కుటుంబ సభ్యులు స్నేహితుల సమక్షంలో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. అయితే స్టార్ హీరో కూతురు పెళ్లి అంటే వేరే లెవెల్ లో ఉంటుందని అందరూ ఊహిస్తుంటారు .

కానీ అలాంటి ఆర్భాటాలు ఏమీ లేకుండా సింపుల్ గా తమ పెళ్లిని కానిచ్చేశారు. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుని అందరిని అవాక్కు చేశారు.

అంతే కాదు వరుడు చేసిన పని చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో నుపుర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అమీర్ ఖాన్ అల్లుడంటే ఆమాత్రం ఉంటుంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Register wedding in gym dress : జిమ్ డ్రెస్ లో రిజిస్టర్ పెళ్లి

అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్(Ira Khan) పెళ్లి వేడుకలు ముంబైలో ఘనంగా జరిగాయి. . ఈ వేడుకలో అమీర్ ఖాన్‌ (Aamir Khan)తో పాటు ఆయన మాజీ భార్యలు రీనా దత్తా (Reena dutta),

కిరణ్ రావు (Kiran Rao)తో సహా కొడుకు హాజరయ్యారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అమీర్ ఖాన్ అల్లుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు.

స్వతహాగా జిమ్ ట్రైనర్ కావడంతో నుపుర్జిమ్ డ్రెస్ తోనే తన ప్రేయసిని పెళ్లాడాడు. జిమ్ షార్ట్స్ , బనియన్ వేసుకుని తన స్నేహితులతో కలిసి పెళ్లి వేదికపైకి పరిగెత్తుకుంటూ వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

జిమ్ డ్రెస్ (Gym dress) లో రిజిస్టర్ పెళ్లి చేసుకున్న నుపుర్ ఆ తర్వత రిసెప్షన్ కు మాత్రం ట్రెడిషనల్ వేర్ కనిపించాడు. ఇక వధువు ఇరా ఖాన్ అందమైన లెహంగాలో చాలా క్యూట్ గా కనిపించింది.

ఇకపోతే వరుడి వేషధారణపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. కొంత మంది అమరీఖాన్ అల్లుడంటే ఆ మాత్రం ఉంటుందంటూ సపోర్ట్ చేస్తున్నారు.

Nupur Childhood, Profession, Family : నుపుర్ బాల్యం,ప్రొఫెషన్, ఫ్యామిలీ

అమీర్ ఖాన్ (Amir Khan)అల్లుడు నుపుర్ శిఖరే (Nupur Shikhare) అక్టోబర్ 17, 1985న పూణేలో జన్మించాడు. అనంతరం ముంబైలో తన విద్యను పూర్తి చేశాడు. నుపుర్ ఒక ఫిట్‌నెస్ కోచ్.

అతను ఇరా భర్తగానే కాదు అమీర్ ఖాన్, నటి సుస్మితా (Susmitha) బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసి బాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు. ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో @nupur_popeye,

ప్రముఖ కార్టూన్ పేరుతో డెయిలీ వ్యాయామానికి సంబంధించిన వీడియోలు ,చిత్రాలను పోస్ట్ చేస్తూ భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.

నూపూర్ కుటుంబానికి కూడా కళలతో సంబంధం ఉంది. అతని తల్లి, ప్రీతమ్ శిఖరే (Preetam Shikhare), శిక్షణ పొందిన కథక్ నృత్యకారిణి. ఆమె సుస్మితా సేన్ కుమార్తె, వర్ధమాన నటుడు రెనీ సేన్‌కు నాట్యంలో శిక్షణ ఇచ్చింది.

Nupur Relation with Ira Khan : ఇరాతో నుపుర్ రిలేషన్

కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో నుపుర్ అమీర్‌ ఖాన్ (Aamir Khan)కు శిక్షణ ఇస్తున్నప్పుడే ఇరాతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడం ,

ఫోటోలను పంచుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరప్రేమించుకుంటున్నారని న్యూస్ వ్యాపించింది.

ఇక గత సంవత్సరం సెప్టెంబర్‌లో నుపుర్ ఇరాకు ప్రపోజ్ చేశాడు. ఇద్దరూ వారి రిలేషన్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. గత ఏడాది నవంబర్‌లోనే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది.

ఈ ఎంగేజ్మెంట్ లో నుపుర్ మోకాళ్లపై కూర్చుని ఇరాకు ప్రపోజ్ చేసి అందరి మనసులను గెలుచుకున్నాడు.

Leave a Comment