నల్గొండ ఘటన లో అధికారులపై చర్య – లేదంటే 2014 మళ్ళి రిపీట్ – BRS జగదీశ్ రెడ్డి

website 6tvnews template 2024 04 04T154338.727 నల్గొండ ఘటన లో అధికారులపై చర్య - లేదంటే 2014 మళ్ళి రిపీట్ - BRS జగదీశ్ రెడ్డి

ఇటీవల నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ కి చెందిన హిల్‌ కాలనీలో దారుణ సంఘటన ఒక బయటకి వచ్చింది. మూత లేని వాటర్‌ ట్యాంకులో దాదాపు 30 కోతులు పడి పైకి రాలేక ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భాయాందోళనకు గురవుతున్నాయి. అంతే కాదు కోతులు చనిపోయిన దాదాపు 10 రోజులపైనే అయి ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచి అదే నీటిని తాగుతున్నామని వారు చెప్తున్నారు.

వారికి ఎలాంటి రోగాలు వస్తాయో అని భయపడుతున్నారు. నాగార్జున సాగర్ లో కోతులు చనిపోయిన తాగునీటి వాటర్ ట్యాంక్‌ను పరిశీలించిన BRS పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ తక్షణం ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేసారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను,పాలనను ఎప్పుడో గాలికి వదిలేసింది.. సాగు,తాగు నీటి సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన ఎద్దేవా చేసారు. నాగార్జునసాగర్‌ను మున్సిపాలిటీగాను పర్యాటక ప్రాంతం గాను తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది BRS అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అయితే అధికారులు ఆ టాంక్ గురంచి అసలు పట్టించుకోవడం లేదని అలాగే ట్యాంకును శుభ్రం చేయడం లేదని స్థానికంగా ఉండే ప్రజలు ఆరోపిస్తున్నారు.

గత 3 రోజులుగా నీరు సరఫరా కాకపోవడం వల్ల అనుమానం వచ్చి ట్యాంకును చూడగా కోతుల విషయం బయటకి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కి ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల ఆరోగ్యం వారికి అవసరం లేదని ఆయన చాల ఘాటు గా విమర్శించారు.

Leave a Comment