Amala Paul: అమలా పాల్‎కు కవలలు..గుడ్ న్యూస్ చెప్పిన నటి

website 6tvnews template 2024 03 21T111129.750 Amala Paul: అమలా పాల్‎కు కవలలు..గుడ్ న్యూస్ చెప్పిన నటి

తమిళ నటి అమలా పాల్ (Amala Paul) పేరు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తెలుగువారికి మాత్రం ‘ప్రేమ ఖైదీ’(PremaKhaidi)సినిమాతో పరిచయమైన అమలాపాల్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆతర్వాత సిద్ధార్థ్(Siddarth) హీరోగా వచ్చిన లవ్ ఫెయిల్యూర్ (Love Failure)మూవీలోనూ నటించి యువతలో క్రేజ్ సంపాదించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఇద్దరమ్మాయిలతో (Iddarammailatho) సినిమాలోనూ నటించి తన నటనతో మెప్పించింది.

తెలుగులోనే కాదు తమిళ ఇండస్ట్రీలోనూ టప్ హీరోలతో యాక్ట్ చేసి స్టార్డమ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. కమర్షియల్ మూవీసే కాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని సినీ విమర్శకులను సైతం ఫిదా చేసింది. ఆమె(Ame) అనే సినిమాలో నగ్నంగా నటించి ఏ హీరోయిన్ చేయని సాహసాన్న చేసి వార్తల్లో నిలిచింది. ఈ నటి తన ప్రేమ, పెళ్లిళ్లు, పర్సనల్ లైఫ్ కారణంగా నిత్యం నెట్టింట్లో టాక్ ఆఫ్ ది టౌన్ లా వినిపిస్తుంది. తాజాగా ఈ చిన్నదానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

రెండో భర్తతో కవల పిల్లలు :

అమల పాల్ (Amala Paul) గతంలో తమిళ డైరెక్టర్ విజయ్ (Vijay)ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా వీరిద్దరూ అఫీషియల్ గా డివోర్స్ తీసుకున్నారు. అయితే వీరి డివోర్స్ కిసంబంధించిన న్యూస్ ఇప్పటికీ తమిళనాట హాట్ టాపికే. అమలాపాల్ , విజయ్ ఏ కారణంతో డివోర్స్ తీసుకున్నారని ఫ్యాన్స్ ఇప్పటికి డిస్కస్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే అమలా పాల్ రెండో వివాహం చేసుకుంది. జగత్‌ దేశాయ్‌ (Jagath Desai)తో కొన్ని రోజుల డేటింగ్ తర్వాత ఈ పెళ్లి చేసుంది. ఇప్పుడు అమలాపాల్ ప్రెగ్నెంట్. రీసెంట్ గా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ప్రెగ్నెన్సీపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తోంది. ఈ అమ్మడు లేటెస్టుగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే కవల పిల్లలను కనబోతున్నా అంటూ చెప్పి ఫ్యాన్స్ ను ఖుష్ చేసింది.

అమలా పోస్ట్ వైరల్ :

అమలా పాల్ (Amala Paul) కవల పిల్లలను కనబోతుందనే ప్రచారం ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో జరుగుతోంది. దాంతో అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు. తాజాగా అమలా పాల్ ఓ చిన్న పాపను ఎత్తుకొని ‘టూ హ్యాపీ కిడ్స్’ అనే క్యాప్షన్ తో ఈ హ్యాపీ న్యూస్ ను షేర్ చేసింది. మరి అమలాపాల్ నిజంగానే కవలలకు జన్మనివ్వనుందా..? లేదా మరేమైనా విషయం ఉందా అన్నది మాత్రం త్వరలోనే తేలనుంది.

Leave a Comment