Ananya Nagalla: ఆ విషయంలో నా మనసు మార్చుకున్న

website 6tvnews template 2024 02 29T142407.202 Ananya Nagalla: ఆ విషయంలో నా మనసు మార్చుకున్న

తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ల (Ananya Nagalla) వెండితెరకు పరిచయమైన కొద్దిరోజుల్లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. ‘మల్లేశం’ (Mallesam ) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన అనన్య ఫస్ట్ మూవీతోనే తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

‘మల్లేశం’ సినిమా కూడా విజయవంతం కావడంతో అమ్మడికి వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు దూరంగా, నటనకు ఆస్కారం ఉన్న సినిమాల్లోనే కనిపించింది.

అయితే అనన్య లేటెస్ట్ గా తన మనసుని మార్చుకుందట. అందాల ఆరబోతకు, కిస్ సీన్లకు సై అంటోంది ఈ భామ. బోల్డ్ సీన్లలో నటించేందుకు ఏమాత్రం వెనకాడటం లేదట. ఇంతలా ఉన్నట్టుండి తన మనసు మార్చుకోవడానికి కారణాలేంటని అభిమానులు తెగ ఆలోచించేస్తున్నారట.

యాక్టింగ్ లో రొమాంటిక్ సీన్లు ఓ భాగమే :

శ్రీనివాస్ గోపిశెట్టి (Srinivas Gopishetty )డైరెక్షన్ లో మార్చ్ 15 న రిలీజ్ కాబోతున్న మూవీ తంత్ర (Tantra ). ఈ మూవీలో అన‌న్య నాగళ్ల (Ananya Nagella)కీ రోల్ పోషిస్తోంది.

మర్యాదరామన్న (Maryadaramanna ) ఫేం సలోని ( Saloni ) , టెంపర్ వంశీ (Temper Vamsi ), మీసాల లక్ష్మణ్ (Meesala Lakshman )లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీం ప్రమోషన్ పనిలో పడింది.

తాజాగా ‘తంత్ర’ (Tantra ) మేకర్స్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ లో అనన్య బోల్డ్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ట్రైలర్ ఈవెంట్ లో అనన్య(Ananya Nagalla) మాట్లాడుతూ..” కెరీర్ స్టార్టింగ్ లో రొమాంటిక్ సీన్లలో నటించనని చెప్పాను. కానీ ఇప్పుడు నా మనసు మార్చుకున్న. నేను నటిస్తున్న మూవీలో సుదీర్ఘమైన కిస్ సీన్ ఉంది. ఆ సినిమాకు అది అవసరమా కాదా అన్నది తర్వాత మాట్లాడుకుందాం. కానీ, ఆ సీన్ ముఖ్యం కాబట్టే నేను అలా చేశాను.

‘తంత్ర’(Tantra) మూవీలో గ్లామర్, రొమాంటిక్ సీన్లు, సోషల్ మెసేజ్, హారర్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి . ఆయా సినిమాలకు గ్లామర్ రోల్ అవసరం అయితే తప్పకుండా నటిస్తాను. నటిగా నన్ను నేను మార్చుకుంటేనే ఎదుగుదల ఉంటుంది. లేదంటే నా గ్రోత్ అక్కడే ఆగిపోతుంది. ‘మల్లేశం’ (Mallesam )సినిమా టైం లో ఎలా నటించిన మనకు ఛాన్సులు వస్తాయి అనుకున్నాను. అయితే, నటనలలో రొమాంటిక్ సీన్లు ఓ భాగం అని అర్థం చేసుకోవడానికి నాకు కాస్త టైమ్ పట్టింది “అని అనన్య కామెంట్ చేసింది.

భయపెడుతోన్న తంత్ర ట్రైలర్ :

లేటెస్ట్ గా విడుదలైన తంత్ర ట్రైలర్ (Tantra Trailer) సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. హార‌ర్‌ ఎలిమెంట్స్‌ తో ఈ సినిమా అందరినీ భయపెడుతోంది.. ఇప్పటికే మేకర్స్ పిలబచ్చాలకు నో ఎంట్రీ అని ప్రకటించారు. ఇక అనన్య నాగళ్ల(Ananya Nagalla) క్యారెక్టర్ విషయానికొస్తే. ఓ పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలు ప్రయోగించబడిన బాధితురాలిగా అనన్య కనిపించనుంది. ఇక సీనియర్ నటి సలోని(Saloni ) ఓ కీలక పాత్ర లో కనిపించునుంది. ధ‌నుష్ ర‌ఘుముద్రి(Dhanush Raghumudri) ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

Leave a Comment