అది తట్టుకోలేక అమెరికా వెళ్లిపోయా..

website 6tvnews template 2024 03 16T142406.883 అది తట్టుకోలేక అమెరికా వెళ్లిపోయా..

Actress Avantika Vandanapu interesting comments about her acting career : ఒకప్పుడు బాలీవుడ్ (Bollywood )తారలు మాత్రమే హాలీవుడ్(Hollywood )కి వెళ్లాలని కలలు కనేవారు. అనుకున్నట్లే కొంతమంది ఆ హాలీవుడ్ డ్రీమ్స్ ను నిజం చేసుకున్నారు. అలాంటిది టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ అయిన చిన్నారి ఇప్పుడు హాలీవుడ్‌లో క్రేజీ స్టార్ గా మారింది .

వరుసగా వెబ్ సిరీస్‌లతో ఆధరగొడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నదే అవంతిక వందనపు(Avantika Vandanapu). అక్కడ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీ గా మారింది అవంతిక. హాలీవుడ్ నటిగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ రీసెంట్ గా ఒక తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

నా లక్ష్యం నెరవేరింది :

‘ప్రేమమ్’(Premam ),‘బ్రహ్మోత్సవం’ (Bramhotsavam ) చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం అయ్యింది అవంతిక (Avantika Vandanapu). అయితే తెలుగులో ఈ చిన్నారికి అనుకున్నంత గుర్తింపు రాలేదు . దీంతో ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ కాగానే అమెరికాకు వెళ్లిపోయింది. 2017లో అమెరికాకు వచ్చిన సంగతిని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అవంతిక.

‘‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా , హీరోయిన్‌గా చేయొచ్చు. కానీ ఈ రెండింటి మధ్యలో మాత్రం చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ టైమ్ లో ఫ్రీ గా ఉండడం తట్టుకోలేకపోయాను. అందుకే అమెరికా(America )కు వెళ్లిపోయా. ఈ 5 ఏళ్లలో హాలీవుడ్‌(Hollywood )లో నాకంటూ ఒక కెరీర్ ఏర్పాటు చేసుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నా. ఇప్పుడు అదే జరిగింది.” అని చెప్పుకొచ్చింది అవంతిక.

నా టార్గెట్ అదే :

అవంతిక(Avantika Vandanapu) పుట్టి, పెరిగింది అమెరికా(America)లోనే. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉంటూ అక్కడే ఓ కాలేజ్‌లో చదువుతోంది. తనకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు హైదరాబాద్(Hyderabad) వచ్చింది.

రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత అమెరికా వెళుపోయింది. ” నాకు ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాలు చేయాలని ఉంది. తెలుగులోనే కాదు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్‌ అన్నింటిలో అడుగు పెట్టాలి. అన్నింటిలో ఒక కెరీర్ ఉండాలి అన్నదే నా టార్గెట్ “. అని చెబుతోన్న అవంతిక కాన్ఫిడెన్స్ చూసి చాలామంది ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

హాలీవుడ్‌లో అది కష్టం :

” 10 పదేళ్లకే కెరీర్ స్టార్ట్ చేశాను. నాకోసం నా పేరెంట్స్ కూడా అమెరికకు షిఫ్ట్ అయ్యారు. హాలీవుడ్‌ లో
అప్పట్లో అవకాశాలు రావడం కష్టంగా ఉండేవి. సౌత్ ఏషియన్స్‌ను ఎక్కువగా సపోర్ట్ చేసేవారు కాదు.అందులోనూ నేను చిన్నపిల్లని.

అందుకే అమ్మ నన్ను టాలీవుడ్‌ కి పంపించింది. 3 నెలల పాటు ఆఫర్ వస్తే చేసి మళ్లీ వెళ్లాలని అనుకున్న. కానీ ఆఫర్లు ఎక్కువగా రావడం వల్ల అయిదేళ్లు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది’’ అని తన యాక్టింగ్ కెరీర్ గురించి చెప్పింది.

Leave a Comment