టాలీవుడ్ లో విశ్వక్ సేన్ (Vishwak Sen)కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. యూనిక్ స్టోరీస్ తో విశ్వక్ ఎప్పుడూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. మాస్ అండ్ బోల్డ్ క్యారెక్టర్స్‌కి ఈ యువ హీరో కేరాఫ్ అడ్రస్ అని చెప్పక తప్పదు. మొన్నటి వరకు మాస్ రోల్స్‌తో అల్లాడించిన విశ్వక్ ఇప్పుడు తన రూటు మార్చాడు. సరికొత్త క్యారెక్టర్స్ తో సాహసాలు చేస్తున్నాడు. ఈసారి విశ్వక్ ‘గామి'(Gaami )మూవీలో అఘోరా పాత్రతో ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు .
ఇండియాస్ట్రీ లో తనకున్న మాస్ ఇమేజ్‌ని పక్కన పెట్టి అఘోరా అవతారమెత్తాడు. విద్యాధర్ ఈ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరి(Chandini Chowdary )ఇందులో ఫిమేల్ లీడ్ రోల్ చేసింది. శివరాత్రి (Sivatathri )కానుకగా ఇవాళ ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో నటి చాందిని చౌదరి ‘గామి’ షూటింగ్ అనుభవాలను షేర్ చేసుకుంది.
2019లో ‘గామి’ జర్నీ స్టార్ట్ :
“2018లో డైరెక్టర్ విద్యాధర్(Vidyadhar)ని కలిశాను. మేమిద్దరం సినిమా కంటే ఎక్కువగా వేరే టాపిక్ గురించి మాట్లాడుకునేవారం. మా ఇద్దరి మధ్య ఓ ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అయింది. తర్వాత 2019లో ‘గామి'(Gaami) మొదలైంది. విద్యాధర్ తో పాటు అయన డైరెక్షన్ టీం గామి కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ మూవీ జర్నీలో మా అమ్మ నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచింది. అందుకే మా అమ్మ నీకు థాంక్స్.
అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు :
హిమాలయాస్‌లో మైనస్ 40 డిగ్రీలో గామి (Gaami ) షూటింగ్ చేసాం. అక్కడ ఆక్సిజన్ కూడా అందదు. విశ్వక్, నేను ఆక్సిజన్ ట్యాంక్స్ పట్టుకుని చాలా సీన్స్ చేయాల్సిన పరిస్థితిల్లో. ఆక్సిజన్ తక్కువగా ఉండటం వల్ల కళ్ళు తిరుగుతాయి. ఏం మాట్లాడుతున్నామో..ఏం చేస్తున్నామో అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో డైలాగులు చెప్పాలి. ఆ సమయంలో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎంతో సపోర్ట్ చేసింది. వారి వల్లే అలాంటి పరిస్థితుల్లోనూ షూట్ చేసాం.
ఈ మూవీ హిస్టరీలో మిగిలిపోతుంది :
గామి మూవీలో జాహ్నవి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ కి థాంక్స్. ఎందుకంటే గామి ఫిల్మ్ చరిత్రలో మిగిలిపోయే సినిమా. మీరు చూసే ప్రతి అద్భుతమైన విజువల్స్ కి మా డీఓపీ విశ్వనాథ్ (Vishwanath ) కారణం. ఆయనతో నేను ‘మను'(Manu ) మూవీ చేశాను. ఒక కెమెరాతో ఎంత అద్భుతం చేయొచ్చో ఆయన వర్క్ లో తెలుస్తుంది” అని చాందిని తెలిపింది.