అదిరిందయ్యా అప్డేట్ బన్నీ బాబుతో..బ్యూటీ సామ్

website 6tvnews template 2024 04 02T124052.758 అదిరిందయ్యా అప్డేట్ బన్నీ బాబుతో..బ్యూటీ సామ్

Actress samantha ruth prabhu starring in allu arjun movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) నటించి పుష్ప2 (Pushpa 2) కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు ఈ సినిమా తర్వాత బన్నీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే పుష్పను మించి ఉండేలా తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు అల్లు అర్జున్.

పుష్ప 2 నే కాదు తర్వాత చేయబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఈ క్రమంలో బన్నీబాబు వరితో సినిమా చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌లుపై రోజుకో గాసిప్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

అంతే కాదు ఇప్పుడు చిత్రీకరణ జరుపుకుంటున్న ‘పుష్ప 2’గురించి కూడా రకరకాల వార్తలు విస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో సమంత కనిపిస్తుందని వార్తలు తెగ వచ్చాయి. అయితే దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ న్యూస్ ఫేడౌట్ అయిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

అట్లీతో కొత్త ప్రాజెక్ట్ :

కింగ్ ఖాన్ షారుక్ ఖాన్‌ (Sharukh Khan ) హీరోగా, యంగ్ డైరెక్టర్ అట్లీ (Atlee ) తీసిన ‘జవాన్’ (Jawaan) మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసేసింది. రూ.1000 కోట్ల వసూళ్లను రాబట్టి అట్లీకి పాన్ ఇండియా ఇమేజ్ తీయనుకోచ్చింది. దీంతో బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో అట్లీ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టు గురించి అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ టైం లోనే అట్లీ, అల్లు అర్జున్ (Allu Arjun)తో మూవీ చేయబోతున్నాడు. వాస్తవానికి ‘జవాన్’ మూవీలో నే అల్లు అర్జున్ తో ఓ స్పెషల్ క్యామియో ప్లాన్ చేశాడు అట్లీ. అయితే కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ కాలేదు. దీనితో ఈసారి అట్లీ బన్నీ తో ఓ మాస్ మూవీ తీసేందుకు రెడీ అయ్యాడు. అట్లీ, అల్లు అర్జున్‌ల కాంబినేషన్ లో వచ్చే మూవీకి ‘ఏఏఏ’(AAA)అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.

బన్నీ బాబుతో సమంత జోడీ :

ఈ మద్యనే బన్నీ బాబు దుబాయ్‌లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. దానికి టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది బన్నీకి విషెస్ తెలిపారు.సౌత్ స్టార్ బ్యూటీ సమంత (Samantha)కూడా అల్లు అర్జున్‌ (Allu Arjun)కు విషెస్ తెలిపింది. దాంతో మళ్లీ వీరిద్దరూ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటారని రూమర్స్ నెటింట్లో మొదలయ్యాయి. అందులోనూ అట్లీ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సమంత పేరు బాగా వినిపిస్తోంది. గతంలో ‘తేరి’(Theri)సినిమాలో అట్లీ (Atlee), సమంత (Samantha)తో కలిసి పనిచేశాడు. ‘జవాన్‌’(Jawaan) సినిమాలో కూడా సమంత హీరోయిన్‎గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాలేదు. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీలో కూడా సమంత పేరు వినిపిస్తోంది.అయితే మూవీ టీమ్ నుంచి అఫీషియల్లీ ఎలాంటి అనౌన్స్‎మెంట్ రాలేదు. మరి వీరి జోడీ కుదురుతుందా? కుదరదా అన్నదాని గురించి తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.

Leave a Comment