Actress Suhasini: నేను హీరోయిన్ కావడం ఆమెకు ఇష్టం లేదు

WhatsApp Image 2024 03 08 at 11.24.26 AM Actress Suhasini: నేను హీరోయిన్ కావడం ఆమెకు ఇష్టం లేదు

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ సుహాసిని మణిరత్నం (Suhasini Maniratnam). తమిళ సీనియర్ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) అన్న కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చారు సుహాసిని. స్టార్‌ కిడ్‌ గానే సుహాసిని చాలా సినిమాలు చేశారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో కథానాయకిగా నటించారు. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

1980,90లలో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు సుహాసిని. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సుహాసిని ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ గా మూవీస్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ గా అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ ఆమె అందం చెక్కు చెదరలేదు. ఆమె అందం, అభినయం ఇప్పటికీ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి.

నేను హీరోయిన్ అవ్వాలనుకోలేదు :

ఈ మధ్యనే చేసిన ఓ ఇంటర్వ్యూలో సుహాసిని (Suhasini) పర్సనల్ విషయాలతో పాటు తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ అంశాలను షేర్ చేసుకున్నారు. “హీరోయిన్ కావడం కంటే, సినిమాటోగ్రాఫర్ (cinematographer)కావాలనే కోరికతోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే అప్పట్లో టెక్నికల్ వైపు పెద్దగా అవకాశాలు లేవు. దీంతో నటిగా కెరీర్ మొదలు పెట్టాను. హీరోయిన్ గా నేను చేసిన ఫస్ట్ మూవీకే బెస్ట్ ఫీమేల్ లీడ్ విభాగంలో అవార్డు వచ్చింది.

అప్పటికే నేను సినిమాటోగ్రఫీ గురించి తెలుసుకునేందుకు ఓ కోర్సులో కూడా చేరాను. ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యాక, సినిమాటోగ్రఫీ కోర్సు పూర్తి చేశాను. కోర్స్ కంప్లీట్ అయినా నాన్ను ఎవరూ సినిమాటోగ్రఫీ వైపు పిలవలేదు. హీరోయిన్ గా నటించమనే చాలా మంది అడిగారు. ఆ సమయంలో నాకు సినిమాటోగ్రఫీ మీద ఉన్న ఇష్టంతో రజనీకాంత్ సినిమాలకు కూడా నో చెప్పాను. చివరకు నన్ను సినిమాటోగ్రాఫర్ గా పిలవరని అర్థం అయ్యింది. దీంతో మళ్లీ హీరోయిన్ గానే కెరీర్ లో కంటిన్యూ అయ్యాను.

శ్రీదేవికి అది ఇష్టం లేదు :

“అప్పటి అందాల నటి శ్రీదేవి (Sridevi)తల్లి నన్ను హీరోయిన్ అవుతావని చెప్పారు. అయితే నేను నటి కావడం ఆమెకు ఇష్టం లేదు. అప్పుడు శ్రీదేవి కూడా నువ్వు నటి కావడం నాకు ఇష్టం లేదని చెప్పింది. మేమంతా హీరోయిన్లుగా ఉన్నాం. సినిమాటోగ్రాఫర్ గా ఒక్క ఆడపిల్ల వచ్చింది. ఆమెను అలాగే ఉండనివ్వు అని శ్రీదేవీ తన తల్లితో చెప్పారు.

అయినా, శ్రీదేవి మదర్ నువ్వు హీరోయిన్ వే అన్నారు. ఇప్పుడు ఆమె చెప్పిందే నిజం అయ్యింది. అప్పటి హీరోయిన్లు తెలివైన వాళ్లం కాదు. కేవలం యాక్టింగ్ మాత్రమే తెలుసు. మిగతా విషయాలు పెద్దగా తెలియవు. కానీ ఇప్పటి హీరోయిన్లు చాలా తెలివైన వారు. స్కిన్‌ కేర్‌, బాడీ లాంగ్వేజ్‌, డ్రస్సింగ్‌ గురించి వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియాదు. మాకు ఇవేమి తెలిసేవి కాదు”అని సుహాసిని (Suhasini) చెప్పారు.

Leave a Comment