Chiranjeevi–Trisha : పద్మవిభూషన్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న 156వ మూవీ విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ (Vasishta) డైరెక్షన్లో భారీ బడ్జట్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇటీవల నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలన్న కసితో ఉన్నారు మెగాస్టార్.
ఈ మధ్యనే సినిమా కోసం భారీ కసరత్తులు చేసిన వీడియో కూడా నెట్టింట్లో ప్రత్యక్షమైంది. అన్నయ్య జిమ్ వర్కౌట్స్ చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇక ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగాయి. బియాండ్ యూనివర్స్ అంటూ మేకర్స్ విశ్వంభరను ప్రమోట్ చేస్తున్నారు.
దీనిని బట్టి చిరు నటిస్తున్న విశ్వంభర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న కన్ఫ్యూజన్ నటిచింది. అయితే తాజాగా మేకర్స్ త్రిష (Trisha)ను చిరుకు జోడీగా ఫైనల్ గా సెలెక్ట్ చేశారు. దీంతో 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్‌తో త్రిషా రొమాన్స్ చేయబోతోంది.
Trisha Rejected Acharya : ఆచార్య నుంచి తప్పుకున్న త్రిష
2016లో మురుగదాస్ (Murugadas)డైరెక్షన్ లో వచ్చిన మూవీ స్టాలిన్ (Stalin). ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరో కాగా త్రిష (Trisha)ఆయనకు జోడీగా నటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జోడీ మరో మూవీ చేయలేదు. ఈ సినిమా వచ్చి దాదాపు 18 ఏళ్ల తర్వాత మెగాస్టార్, త్రిషలు మరోసారి విశ్వంభర (Vishwambhara)ప్రాజెక్ట్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మొన్నటి వరకు హీరోయిన్ ఎవరన్న డైలమాలో ఉన్నారు మెగా ఫ్యాన్స్ .
తాజాగా విశ్వంభర టీమ్ అధికారికంగా త్రిష హీరోయిన్ అని ప్రకటించడంతో మళ్లీ వీరిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే స్టాలిన్ తర్వాత ఆచార్య సినిమా నుంచి త్రిషకు ఆఫర్ అందింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆచార్య నుంచి తప్పుకుంది ఈ బ్యూటీ. అప్పట్లో త్రిష సినిమా నుంచి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.
ఆచార్య గొడవతో మెగాస్టార్ , త్రిష కలిసి మళ్లీ నటించరంటూ అప్పట్లో రూమర్స్ కూడా వచ్చాయి. కానీ విశ్వంభరతో వాటికి చెక్ చెప్పారు చిరు. విశ్వంభరలో త్రిష హీరోయిన్ అంటూ స్వయంగా మెగాస్టార్ ప్రకటించి పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కోలీవుడ్ లో త్రిష కు ఓ రేంజ్ లో డిమాండ్ పెరిగింది. పొన్నియన్ సెల్వన్ (Ponniyan selvan) తో పాటు ఈ భామ రీసెంట్ గా నటించిన లియో(Leo) బిగ్ హిట్ కావడంతో అమ్మడికి ఆఫర్లు వరుసగా తలుపుతడుతున్నాయి.
ఈ క్రమంలోనే విశ్వంభర మేకర్స్ తమ సినిమాలో త్రిషను ఫైలన్ చేశారు. ఈ సినిమాలో త్రిషతో మరో హీరోయిన్ కూడా ఉండనున్నట్లు సమాచారం. ఆమె ఎవరన్నది త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
Planning to release on Sankranthi : సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు
బింబిసార (Bimbisara)మూవీ తర్వాత ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వశిష్ట (Vasishta)విశ్వంభర(Vishwambhara) తెరకెక్కుతోంది. బింబిసార బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడం అందులో మెగాస్టార్ నటిస్తుండటంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. గత ఏడాది నవంబర్ నుంచే మూవీ షూటింగ్ మొదలైంది.
రీసెంట్ గా మెగాస్టార్ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టారు. సినిమా షూటింగ్ జరుగుతుండగానే విశ్వంభరను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. విశ్వంభరను వచ్చే ఏడాది సంక్రాంతిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏడాది ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. దాదాపు వంద కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీని యూవీ క్రియేషన్స్ (UV Creations) పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డుగ్రహీత కీరవాణి (Keeravani) సంగీతాన్ని అందిస్తుండగా సుస్మిత కొణిదెల (Susmitha Konidela) కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తోంది.