AdaviShesh and Shruti are coming to thrill: అడవి శేష్, శృతిహాసన్ లు థ్రిల్ చేయడానికి వస్తున్నారు.
టాలీవుడ్ థ్రిల్లర్ చిత్రాలకి బ్రాండ్ గా మారాడు అడవిశేష్. ఇప్పటివరకు అడవి శేష్ చేసిన క్షణం, ఎవరు, గుడాచారి ఇలా దాదాపు అన్నీ సినిమాలు థ్రిల్లర్ జానర్ లో చేసినవే, పైగా అన్నీ సూపర్ హిట్లు.
ఈ జానర్ లో అడవి శేష్ ప్రేక్షకులని మెప్పించినంతగా ఇంకెవరూ చేయలేరు అన్నంతగా చేశాడు. అదే పాజిటివ్ టాక్ తో మరో థ్రిల్లర్ సినిమా చేయడానికి సిద్దమయ్యాడు.ఈ సారి అడవి శేష్ కి జంటగా స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటించనుంది.
ఈ సినిమా గురించి శృతిహాసన్ అధికారికంగా తన ట్విటర్ అకౌంట్ లో ఒక పోస్టర్ విడుదల చేసింది. అది కూడా #SeshEXSruthi అనే హ్యాష్ టాగ్ ని పెట్టి మరీ ఆ పోస్టర్ ని విడుదల చేసింది.
ఆ పోస్టర్ లో అడవిశేష్ ఆహార్యం చాలా భిన్నంగా ఉంది. పోస్టర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది, ఎంతైనా థ్రిల్లర్ కదా!ఈ సినిమా అన్నపూర్ణ ప్రొడక్షన్ లో తెరకెక్కనుంది.
సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాని నిర్మిస్తుంది.సానియెల్ డియో దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకి సంబందించిన పేరు ని అధికారిఖంగా డిసెంబర్ 18 వ తారీఖున వెల్లడించనున్నట్టుగా తెలిపింది.
ఇక అడవి శేష్ కూడా తన Xలో , ఈ చిత్రం స్ట్రెయిట్ బాలీవుడ్ లేదా తెలుగు చిత్రం కాదు, అల్ – ఇండియన్ ఫిల్మ్ అంటూ పోస్ట్ చేశాడు.ప్రతి సారి హిట్టు కొట్టినట్టే, ఈ సారి కూడా అడవిశేష్ థ్రిల్లర్ జోనర్ లో హిట్టు కోడతాడో లేదో చూడాలి మరి.