AI టెక్నాలజీ వచ్చిన వాళ్ళు రండి బాబు రండి – హైదరాబాద్ లో 1,50,000 జాబ్స్

EC Artificial Intelligence 750 AI టెక్నాలజీ వచ్చిన వాళ్ళు రండి బాబు రండి - హైదరాబాద్ లో 1,50,000 జాబ్స్

రాబోయే రెండేళ్లలో లక్షన్నర మందికి AI ఆధారిత ఉద్యోగాలు వస్తాయని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు అందరు AI లో ట్రైనింగ్ తీసుకుంటున్నారని IT వర్గాలు వారు చెప్పారు. AI లో వచ్చే మార్పులకు అనుగుణంగా యూత్ కు ప్రత్యేక శిక్షణ కోసం IIT లు పలు రకాల కొత్త కోర్సులను ప్రవేశపెట్టాయి. దీని లో భాగం గా మద్రాస్ IIT వాళ్ళు AI లో
స్పెషలిస్ట్ లను తయారు చేసేందుకు వీలుగా UK లోని బర్మింగ్ హామ్ యూనివర్శిటీతో కలిసి AI – M.Sc మాస్టర్స్ కోర్సును ప్రవేశపెట్టింది. భవిష్యత్ లో అంతా AI దేనని వార్తలు వస్తున్న తరుణం లో ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు కూడా బాగా ఆసక్తి చూపిస్తున్నారని మద్రాస్ IIT తెలిపింది. AI పై హైదరాబాద్ లో IIIT లు, IIT లు 300కు పైగా రీసెర్చ్ కు సంబందించిన పలు అంశాలను నిపుణులు చర్చించి నట్లు చెప్పారు.టెక్ ప్రపంచంలో AI మానియా నడుస్తుండటంతో హైదరాబాద్ లో అందరి దృష్టి ఇప్పుడు AI మీద పడింది. AI కి హైదరాబాద్ అన్ని రకాల అనుకూలమని టెక్ నిపుణులు చెబుతున్నారు.

AI హైదరాబాద్ కి ఎందువల్ల అనుకూలం:

ఈనాడు ప్రపంచంలోనే అతి పెద్ద IT సంస్దలు అయిన గూగుల్, వరల్డ్ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ కు హైదరాబాద్ లో ప్రధాన కేంద్రాలు గా ఉన్నాయి. వాటితో పాటు మైక్రోసాఫ్ట్ సంస్ద కుడా తన ప్రధాన రెండో క్యాంపస్ హైదరాబాద్ లోనే ఉంది. అంతే కాకుండా ఇతర IT సంస్దలు అయిన యాపిల్‌, ఫేస్‌బుక్‌ లు కూడా ఇక్కడే కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు అతి ప్రధానమైన AI, రోబోటిక్స్, డాటా ప్రొటెక్షన్ వంటి టెక్నాలజీ ఉపయోగించే నగరం ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారబోతోందని పలువురు IT నిపుణులు చెప్తున్నారు.

ప్రస్తుతం భారతదేశంలోనే హైదరాబాద్ ఒక ప్రత్యేక టెక్ హబ్ గా నిలిచింది అని చెప్పవచ్చు. భవిష్యత్ లో AI తో పాటు మెషీన్ లెర్నింగ్ రంగాల్లో కూడా పెట్టుబడులు తెలంగాణ కు భారీ గా రానున్నాయని తెలంగాణ IT నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల భవిష్యత్ లో IT ఎగుమతులు పెరగడమే కాకుండా లక్షలాదిమంది నిరుద్యోగులకు భారీ గా ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలంగాణ IT నిపుణులు చెప్తున్నారు.

Leave a Comment