ఢిల్లీ లో వాయు కాలుష్యం..కృత్రిమ వర్షం ఏ మేరకు ఉపయోగపడుతుంది.
ఢిల్లీ మహానగరం, ఇది ఒక రాష్ట్రమే కాదు, మనదేశానికి రాజధాని కూడా. అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఉండే ఢిల్లీ లో కాలుష్యం కూడా ఎక్కువే. ఢిల్లీ లోని కాలుష్యాన్ని నివారించడానికి కాలుష్య నియంత్రణా మండలి తోపాటు, ప్రభుత్వాలు కూడా అనేక రకాల చర్యలు చేపడుతూ ఉంటాయి.
ఢిల్లీ లోని వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణాలు వాహనాల నుండి వెలువడే పొగ ఒకటైతే, పాత భవనాల కూల్చివేత, పరిశ్రమల నుండి వెలువడే పొగ వంటివి ప్రధాన కారణాలైతే అన్నిటికన్నా ముఖ్యమైనది ఢిల్లీకి దగ్గరలో ఉండే వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పంటలను తగలబెట్టడం.
ఇవన్నీ వెరసి ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తున్నాయి. అయితే కాలుష్య నివారణ కోసం ప్రభుత్వాలు నడుం బిగించినప్పటికీ అది అదుపులోకి వచ్చే లోపుగా ఢిల్లీ వాసులకు కొంత ఉపశాంతి కలిగిచడానికి కృత్రిమ వర్షం కురిపించడానికి సిద్ధమయ్యారు శాస్త్రవేత్తలు.
కృత్రిమ వర్షమా, అది ఎలా కురిపిస్తారు ? అది సాధ్యపడే విషయమేనా ? అని చాల మందికి అనుమానం రావచ్చు. దానికి సమాధానం ఇస్తున్నారు మన దేశ శాస్త్రవేత్తలు.
అయితే ఆ విషయాలు తెలుసుకునే ముందు అసలు ఢిల్లో లో కాలుష్యం ఏ స్థాయిలో ఉంది ? అందుకు గల కారణాలేమిటి ? నివారణ చర్యలు ఇప్పటివరకు ఎలాంటివి తీసుకున్నారు అనేవి చూద్దాం.
Air pollution index is like this:
ఢిల్లీ నగరం పేరు చెప్పగానే ఇంతకు మునుపు ఎర్రకోట అని, ఇండియా గెట్ అని ఏవేవో చారిత్రక ప్రదేశాలు గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం ఢిల్లీ పేరు చెప్పగానే జ్ఞప్తికి వచ్చేది ఒక్కటే అదే వాతావరణ కాలుష్యం.
ఈ వాతావరణ కాలుష్యం రోజు రోజుకి ఢిల్లో లో పెరుగుతొంది తప్ప తగ్గిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఈ వాటా వరణ కాలుష్యాన్ని స్టేజిల రూపంలో కొలుస్తారు, స్టేజ్ 1 అంటే పూర్ అని అర్ధం ఈ స్టేజ్ 1 లో AQI 201 నుండి -300 వరకు ఉంటుంది.
ఇంతకీ AQI అంటే ఏమిటో చెప్పలేనేలేదు కదా, AQI అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. స్టేజ్ II అంటే వెరీ పూర్ అని అర్ధం. ఇక్కడ AQI 301 నుండి -400 వరకు ఉంటుంది.
స్టేజి 3 – ఇది తీవ్రమైన దశ ఇక్కడ AQI 401 నుండి -450 వరకు ఉంటుంది. ఇక ఆఖరిది స్టేజి 4 ఇది మరీ తీవ్రమైన దశ ఇక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 కన్నా ఎక్కువగా ఉంటుంది.
ఇలాంటి సమయంలో వాతావరణంలో ఆక్సీజన్ శాతం చాల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులను ఖచ్చితంగా నివారించాలి.
For prevention of air pollution:
ఈ నివారణ చర్యల్లో భాగంగా ఢిల్లీ లో ఉన్న ప్రభుత్వాలు సరి బేసి సంఖ్యా విధానాన్ని తీసుకొచ్చాయి. ఈ సరి బేసి సంఖ్యా విధానం ఏమిటంటే, మన వాళనాల్లో సరి సంఖ్యా ఉన్న వాటిని ఒక వారం పాటు అనుమతిస్తే బేసి సంఖ్య ఉన్న వాహనాలను మరో వారం పాటు అనుమతిస్తారు.
ఇలా చేయడం వల్ల వాతావరణ కాలుష్యం కొంతమేర తగ్గే వాలుంటుంది. ప్రభుత్వాలు నిర్దేశించిన విధంగానే వాహనదారులు నడుచుకోవాలి లేదంటే పెనాలిటీ కట్టక తప్పదు.
ఇక మరో విధానం పరిశ్రమలను కట్టడి చేయడం. వాతావరణానికి అత్యంత ప్రమాదకరమైన ఫ్యాక్టరీలను కొన్ని రోజుల పాటు మూసివేయించడం తప్పనిసరిగా మారింది.
అలాగే కూలీలు, సిబ్బంది అందుబాటులో ఉంటారు కాబట్టి అన్ని రకాల ఫ్యాక్టరీలు కూడా 24 గంటలు 360 రోజులు రన్నింగ్ లో ఉండాలంటే కుదరదు.
వాటికి కూడా పరిమితి విధించాల్సిందే. ఏవైనా కొన్ని అవసరమైన వాటికి మాత్రమే అనుమతుల్లో సడలింపులు ఇచ్చేవారు.
Farmers also have air pollution:
ఇక మరో ముఖ్యమైన అంశం ఒకటి ఉంది. ఢిల్లీ లోని NCR కి చుట్టుప్రక్కల ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు పంటలను పండించిన అనంతరం వాటి పంట వ్యర్ధాలను తగల బెట్టేవారు.
అయితే పంట వ్యర్ధాలకు నిప్పు పెట్టడం వల్ల అది తీవ్రమైన దట్టమైన పొగను వెదజల్లుతూ ఉంటుంది. పైగా ఆ పంట వ్యర్ధాలలో ఉండే మసి రేణువులు కూడా నగరంలోకి వచ్చి పడటం కూడా జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఇది కూడా కాలుష్యానికి ప్రధాన కారణంగా చెప్పబడుతుంది. దీంతో ఢిల్లీకి చుట్టూ ప్రక్కల ఉన్న రైతులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పంట వ్యర్ధాలను తగలబెట్టడం నిషేధించినట్టు పేర్కొన్నారు. పంట వ్యర్ధాలను తగల బెట్టడానికి బదులుగా రీ సైక్లింగ్ విధానాన్ని అవలంబించాలని సూచిస్తుంన్నారు.
ఈ రీసైక్లింగ్ విధానం తో కాలుష్యం నివారణ అవ్వడమే కాకుండా వ్యవసాయ భూమిని మరింత సారవంతంగా చేస్తుంది.
Problems in Delhi due to pollution:
ఇక ఇప్పటివరకు మనం కాలుష్యానికి గల కారణాలను, నివారణ మార్గాలను మాట్లాడుకున్నాం. అయితే ఈ కాలుష్యం వల్ల ఢిల్లీ నగరంలో ఏర్పడుతున్న అనర్ధాలను కూడా తెలుసుకోవాలి. ఢిల్లీ లో ఏర్పడుతున్న ఈ వాతావరణ కాలుష్యం కారణంగా విపరీతమైన పొగమంచు కమ్ముకుంటూ ఉంటుంది.
దాని వల్ల ఎదురుగా వస్తున్నా వాహనాలు కూడా సరిగా కనిపించవు. పైగా చలికాలం వచ్చిందంటే, రైళ్ల రాకపోకల వేళలు కూడా మారిపోతూ ఉంటాయి.
సాయంత్రం అయిందంటే చాలు రైళ్లకు సిగ్నల్స్ అస్సలు కనిపించవు. దీంతో రైలు నిర్దేశించిన వేగం కన్నా చాలా నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక దట్టమైన పొగమంచు కారణంగా కొంత సమయంలో విమానాల రాకపోకలకు కూడా బెడద ఏర్పడుతుంది.
మరోవైపు ఢిల్లీలో పాఠశాలలకు వింటర్ హాలిడేస్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది కేవలం పొగ మంచు వల్ల దారి కనిపించకపోవడమే, లేదంటే రైళ్లకు సిగ్నల్స్ కనిపించక ఆలస్యం కవాదో కాదు.
ఈ వాతావరణ కాలుష్యం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రజలకు స్వచ్చమైన గాలి అందకపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు లోనవుతూ ఉంటారు.
A waist-tight IIT Kanpur:
అయితే ఈ సమస్యల పరిష్కారానికి ఐఐటీ కాన్పూర్ ఒక ఆలోచనను చేసింది. కృత్రిమ వర్షం అనే విధానాన్ని తెరపైకి తీసుకువస్తోంది.
కృత్రిమ వర్షం కురిపించడం వల్ల కాలుష్యాన్ని కొంతమేర అయినా నివారించడానికి వీలవుతుందని అంటున్నారు. IIT కాన్పూర్‌లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మనీంద్ర అగర్వాల్ ఈ కృత్రిమ వర్షం అనే దానిని ముందుండి నడిపించనున్నారు.
ఢిల్లీ లోని NCR వాసులకు ఈ ఆర్టిఫీషియల్ రెయిన్స్ కాస్తైనా ఉపశాంతి కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ కృత్రిమ వర్షం కురిపించాలి అంటే అందుకు కావాల్సింది క్లౌడ్ సీడింగ్.
క్లౌడ్ సీడింగ్ అనేది కరువుల ప్రభావాన్ని తగ్గించడం అడవి మంటలను నివారించడం, అవపాతం పెరగడం నాణ్యతను పెంచడం వంటి వివిధ ప్రయోజనాల కోసం క్లౌడ్ సీడింగ్ చేస్తారు.
How to do cloud seeding:
ఈ క్లౌడ్ సీడింగ్ అనేదానిని ఎలా చేస్తారు అంటే.. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ డ్రై ఐస్ వంటి రసాయనాలను విమానాలు లేదంటే హెలికాఫ్టర్ల ద్వారా ఆకాశంలోకి విడుదల చేస్తారు.
ఈ రసాయనాలు నీటి ఆవిరిని ఆకర్షిస్తాయి, తద్వారా వర్షపు మేఘాలు ఏర్పడతాయి. ఈ పద్ధతిలో వర్షం కురుస్తుంది. అయితే అలా వర్షం కురిసేందుకు కనీసం అర్ధగంట సమయం తీసుకుంటుంది.
ఈ క్లౌడ్ సీడింగ్ అనే విధానాన్ని రెండు పధతులుగా విభజించవచ్చు. హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్ ఒకటైతే రెండవది గ్లాసియోజెనిక్ క్లౌడ్ సీడింగ్. మొదటిదైన హైగ్రోస్కోపిక్ క్లౌడ్ సీడింగ్ లో ద్రవ మేఘాలలోని బిందువుల సమ్మేళనాన్ని వేగవంతం చేయడానికి చూస్తారు.
అలా దానిని వేగవంతం చేయడం వల్ల అవపాతానికి దారితీసే పెద్ద సైజు నీటి బిందువులు ఏర్పడతాయి. ఈ ప్రాసెస్ లో ఉప్పుకణాలు క్లౌడ్ బేస్ లోకి వచ్చాక చ్చెదిరిపోతాయి.
మరో విధానమైన గ్లాసియోజెనిక్ క్లౌడ్ సీడింగ్ లో సూపర్ కూల్డ్ మేఘాలలో మంచు ఉత్పత్తిని ప్రేరేపించడంపై దృష్టి సారిస్తారు. ఇది అవపాతానికి దోహదం చేస్తుంది. గ్లాసియోజెనిక్ క్లౌడ్ సీడింగ్ అనేది సిల్వర్ అయోడైడ్ కణాలు లేదా డ్రై ఐస్ వంటి సమర్థవంతమైన మంచు కేంద్రకాలను క్లౌడ్‌లోకి వెదజల్లుతుంది, ఇది భిన్నమైన మంచు న్యూక్లియేషన్‌ను ప్రేరేపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానం ఇప్పుడు కొత్తగా కనిపెట్టింది కాదు, ఏ కృత్రివ వర్షం అనేది 2018 లోనే అందుబాటులోకి వచ్చింది.
కానీ ఏఈ కృత్రిమ వర్షాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కురిపించవచ్చు అనుకుంటే పొరపాటే, ముఖ్యంగా ఢిల్లీ వంటి నగరాల్లో దీనిని అవలంబించాలంటే పర్మిషన్లు తప్పనిసరి, ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధాని, ప్రధానమంత్రి ఉండే ప్రాంతం కూడా ఇదే.
కాబట్టి అనుమతుల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ ప్రక్రియకు DGCA, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తోపాటు ప్రధానమంత్రి భద్రతకు బాధ్యత వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నుండి కూడా అనుమతులు పొందాల్సిందే. కృత్రిమ వర్షం కోసం మేఘాల్లోకి విమానాలు లేదంటే హెలికాఫ్టర్ వెళ్లి తీరాల్సిందే.
మరి దేశ రాజధాని మీదుగా విమానాలు ప్రయాణించాలి అంటే అనుమతులు ఉండి తీరాల్సిందే. అయితే ఇన్ని అనుమతులు తీసుకుని దీనిని షురూ చేస్తే తప్పకుండ విసజయవంతం అవుతుందా అంటే అది గారంటీగా చెప్పలేము.
ఎందుకంటే అది నిర్దిష్ట వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, దానికి తేమతో కూడిన మేఘాలు తగిన గాలి నమూనాలు ఉంటాయి.
Are there side effects:
కృత్రిమ వర్షాల గురించి తీసుకుంటే వీటిపై 1940 ల కాలం నుండి పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ వాటి ప్రభావం పై ఖచ్చితత్వం ఇంకా పూర్తగా ఎవ్వరూ నిర్ధారణ ఇవ్వలేదనే తెలుస్తోంది.
కృత్రిమ వర్షాలు అనేవి మేఘాలలోకి లవణాలు లేదంటే ఇతర పదార్థాలను చల్లడం ద్వారా వర్షాన్ని కురిపించే ప్రక్రియ. అలా మేఘాలపై చల్లిన పదార్ధాలు నీటి బిందువులతో కలిసిపోయి వాటిని వర్షం చినుకులుగా మారిపోయేలా చేస్తాయి.
ఈ కృత్రిమ వర్షాలను ఎక్కువగా వ్యవసాయం కోసం ఉపయోగించాలని రూపొందించారు. పంటలకు అవసరం ఉన్న స్థాయిలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న సమయంలో ఈ కృత్రిమ వర్షాలను ఉపయోగించి పంటలకు నీటిని అందించడానికి వీలవుతుంది.
పైగా ప్రజలకు అవసరమైన నీటి వనరుల్లో నీటి స్థాయిలు గణనీయంగా పడిపోయిన సమయంలో కూడా ఈ ఆర్టిఫీషియల్ రైన్స్ ఉపయోగించి వాటిలో నీటిని నింపుతారు.
అయితే వీటి వల్ల ఉపయోగాలు మాత్రమే కాదు దుష్ప్రభాలు కూడా ఉన్నాయి. కృత్రిమ వర్షాల ద్వారా గాలి కాలుష్యం పెరగడం, వర్షపాతం అసమానంగా మారడం కూడా చోటుచేసుకోవచ్చు.