Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజీత్‎కు బ్రెయిన్ సర్జరీ?

WhatsApp Image 2024 03 09 at 12.53.59 PM Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజీత్‎కు బ్రెయిన్ సర్జరీ?

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar)కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనికి సర్జరీ జరిగిందని నెట్టింట్లో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. హెల్త్ ఇష్యూస్ తో అజిత్ హాస్పిటల్ లో చేరారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ న్యూస్ కన్ఫర్మ్ అయినా కూడా అసలు అజిత్ ఆసుపత్రికి ఎందుకు వెళ్లాడు అనే విషయంపై పూర్తిగా క్లారిటీ రాలేదు. అజిత్ కు బ్రెయిన్ సర్జరీ జరిగిందని, అందుకే ఆయన హాస్పిట్ ల్ లో చేరారని తమిళనాడులో వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. దీంతో అజిత్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ ఫేవరేట్ స్టార్ కు ఏం జరిగిందని అంతా కంగారుపడ్డారు. బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) అంటే మామూలు విషయం కాదని, అసలు అజిత్‌కు ఏమయ్యింది అంటూ నెట్టింట్లో డిస్కషన్ జరుగుతోంది. దీంతో అజిత్ హెల్త్ కండీషన్ గురించి స్పష్టత ఇచ్చేందుకు పబ్లిసిస్ట్ ముందుకొచ్చారు.

అజిత్‎కు సర్జరీ :

అంతా అనుకుంటున్నట్లు అజిత్ కు నిజంగానే సర్జరీ జరిగింది. అయితే అది బ్రెయిన్ సర్జరీ కాదు. చెవికి బ్రెయిన్ కు మధ్య కనెక్ట్ అయ్యి ఉన్న ఓ నరం వాయడం వల్ల డాక్టర్లు అజిత్(Ajith)కు సర్జరీ చేశారు. అంతేగానీ ఇది బ్రెయిన్ సర్జరీ కాదని అజిత్ పబ్లిసిస్ట్ సురేశ్ చంద్ర (Suresh Chandra)క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ప్రస్తుతం అజిత్ పూర్తిగా కోలుకున్నాడని త్వరలోనే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

WhatsApp Image 2024 03 09 at 12.54.16 PM Ajith Kumar : తమిళ స్టార్ హీరో అజీత్‎కు బ్రెయిన్ సర్జరీ?

“గురువారం రోజు అజిత్ హాస్పిటల్ కు జనరల్ చెకప్ కోసం వచ్చారు. అప్పుడే వైద్యులు నరాల వాపును గుర్తించారు. సర్జరీ చేయాలని డిసైడ్ అయ్యారు. చిన్న మెడికల్ పద్ధతి ద్వారా డాక్టర్లు సర్జరీ కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఐసీయూ నుంచి వార్డ్‌కు షిఫ్ట్ అయ్యారు.” అని సురేశ్ తెలిపారు.

ఆ రూమర్స్‎కు చెక్ :

సురేష్ ఇచ్చిన క్లారిటీతో అజిత్‌(Ajith)కు బ్రెయిన్ సర్జరీ (Brain Surgery) జరిగిందనే రూమర్స్‌కు చెక్ పడినట్లైంది. దీంతో అభిమానులంతా రిలాక్స్ అయ్యారు. ఫ్యాన్స్ లో ఉన్న సందేహాలకు ఆయన క్లియర్ గా సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అజిత్.. ‘విడా ముయర్చి’(vida mayarchi)అనే మూవీ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ కూడా ప్రారంభమైంది.

అజిత్ కూడా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ (MIlan)హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఆయన మరణం అజిత్‌ను తీవ్రంగా కలచివేసింది. మిలాన్‌ మరణించే ముందు అజిత్ ఫోన్‌లో మాట్లాడరని, మరో అరగంటలో కలుద్దామని కూడా అనుకున్నారని పబ్లిసిస్ట్ తెలిపారు.

ఆరోగ్యంపై మరింత శ్రద్ధ..

షూటింగ్ లో అప్పటివరకు తనతో సరదాగా ఉన్న వ్యక్తి.. ఒక్కసారిగా ఇలా హార్ట్ అటాక్ తో మరణించడంతో అజిత్ (Ajith) తన హెల్త్ పై మరింత దృష్టిపెట్టారు. అందుకే వీలుకుదిరినప్పుడల్లా హెల్త్ చెకప్స్‌కు వెళ్తున్నారు.

ఈ క్రమంలోనే నరాల వాపు గురించి డాక్టర్లు చెప్పగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సర్జరీకి ఓకే చెప్పారు. సర్జరీ కూడా సక్సెస్ అయ్యింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి పూర్తిగా కోలుకున్న తర్వాత ‘విడా ముయర్చి’(vida mayarchi) షూటింగ్‌లో అజిత్ పాల్గొంటారు. మజిర్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అర్జున్ సర్జా (Arjun Sarja), త్రిష (Trisha), రెజీనా (Regina) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Leave a Comment