TANDEL Movie: జాలరిగా మారిన అక్కినేని యువ సామ్రాట్.

Akkineni is a young emperor who became a fisherman.

TANDEL Movie: జాలరిగా మారిన అక్కినేని యువ సామ్రాట్.

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఒక కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మత్స్యకారుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న

” TANDEL” సినిమాలో ఇప్పుడు నాగచైతన్య నటిస్తున్నాడు.ఈ సినిమాలో నాగచైతన్య మాస్ లుక్ తో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.

జాలరిగా NAGA CHAITHANYA:

జాలరిగా కనపడేందుకు నాగచైతన్య చాలా కస్టపడి రగ్గ్డ్ లుక్ లోకి వచ్చాడు.మొత్తం డీగ్లామరస్ లుక్ తో వత్తుగా గడ్డం జుట్టుతో కనపడుతున్నాడు.

ఈ సినిమాలో SAI PALLAVI, NAGA CHAITHANYA కి జోడీగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, పోస్టర్ విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.

TANDEL షూటింగ్ లో లీక్ అయిన ఫోటోస్ :

TANDEL షూటింగ్ టైమ్ లో NAGA CHAITHANYA కి సంబందించిన కొన్ని ఫోటోస్ ఇటీవల లీక్ అయ్యాయి.
పొడుగ్గా పెరిగిన జుట్టు, గడ్డంతో మట్టి గొట్టుకుపోయిన బట్టలతో ఉన్నాడు. ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని ఉడిపి మాల్పే పోర్టులో జరుగుతుంది.ఇటీవల DOOTHA తో OTT లోకి అడుగుపెట్టిన NAGA CHAITANYA అక్కడ కూడా మంచి పేరు సంపాదించాడు.

ప్రపంచవ్యాప్తంగా అమేజోన్ ప్రైమ్ లో విడుదల అయిన DOOTHA ఒక్కసారిగా అన్నీ OTT SERIES ని పక్కకి నెట్టి మొదటి స్థానానికి చేరుకుంది.

Leave a Comment