చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులో ఆస్కార్ ఒకటి. ప్రతి ఏడాది ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని విభాగాల్లో అత్యుత్తమమైన ప్రతిభను చూపించిన డైరెక్టర్లు, యాక్టర్లు, హీరోయిన్లు, రైటర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, టెక్నీషియన్లకు అకాడమీ అవార్డులు అందిస్తారు.
1928లో అప్పటి నటులు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ (Douglas Fairbanks), విలియం డెమిలీ (William DeMille) ఈ ఆస్కార్ వేడుకల (Oscar Awards)ను ప్రారంభించారు. ప్రతి సంవత్సరం లాస్ ఎంజీల్స్ (Los Angels) లో ఆస్కార్ అవార్డుల వేడుక ఎంతో వైభోగంగా జరుతుంది.
కోట్లాది మంది సినీ ప్రేమికలు ఈ వేడుకను చూసేందుకు ఎదురుచూస్తుంటారు. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు ఆస్కార్ బరిలో నిలవాని తపనపడుతుంటారు. కానీ అతికొద్ది మందికే ఆ అదృష్టం వరిస్తుంది. అందుకే ఈ పురస్కారాలకు అంత క్రేజ్ ఏర్పడింది. ఆస్కార్ పురస్కారాన్ని పొందేందుకు వరల్డ్ వైడ్ గా ఉన్న చిత్ర పరిశ్రలు పోటీ పడుతుంటాయి.
ఇప్పటి వరకు భారత్ నుంచి పలు చిత్రాలు, హీరో హీరోయిన్లు, ఆస్కార్ ఆవార్డుల కోసం కోసం నామినెట్ అయ్యారు. గత ఏడాది దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)రూపొందించిన ఆర్ఆర్ఆర్ (RRR)సినిమాలోని ‘నాటు నాటు’(Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. తెలుగువారి సత్తా ఏంటో చూపించింది. దీంతో ఈ ఏడు నిర్వహించనున్న ఆస్కార్ వేడుకలపై ఆసక్తి పెరిగింది. మరి ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న సినిమాలేటి? ఆర్ఆర్ఆర్ రికార్డును అవి బ్రేక్ చేస్తాయా. ఇఫ్పుడు చూద్దాం.
Dasara in oscar race : ఆస్కార్ బరిలో దసరా
2023 ఆస్కార్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ (RRR)మూవీ అవార్డును దక్కించుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాటకు ప్రపంచం మొత్తం ఫిదా అయ్యింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మొదటిసారి ఓ తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డు దక్కింది. దీంతో 2024 ఆస్కార్ అవార్డుల్లో(Oscar 2024) కూడా భారతీయ సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి.
టాలీవుడ్ నుంచి ఈ ఏడాది బలగం (Balagam), దసరా (Dasara) చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి. న్యేచురల్ స్టార్ నాని (Nani)నటించిన ‘దసరా’ సినిమా మద్యపానం, కుల వివక్షత, పెత్తందారితనం వంటి సోషల్ యాస్పెక్ట్స్ ను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)ఎంతో అద్భుతంగా చూపించాడు.
అంతే కాదు స్నేహాన్ని, ఎమోషనల్ సెంటిమెంట్స్ ను అద్భుతవంగా పండించాడు. నాని, కీర్తి సురేష్ ల ప్రేమ కథ కూడా చాలా సహజసిద్ధంగా చూపించాడు. ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. నాని సినీ జర్నీలో ఈ మూవీ ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా హిట్ సాధించింది.
Will Balagam Break RRR record?:బలగం ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేస్తుందా?
తెలంగాణ (Telangana) సాంప్రదాయాలను ప్రతిబింబించే కుటుంబ కథా చిత్రం బలగం (Balagam).తెలంగాణ పల్లెల్లోని కుటుంబ విలువలని బలగం ఎంతో అద్భుతంగా ఆవిష్కరించింది. జబర్దస్త్ కమెడియన్ వేణు (Comedian Venu)ఈ మూవీని డైరెక్ట్ చేశాడు.
హాస్య నటుడిగానే కాదు మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. బలగంలో కనిపించిన ప్రతి క్యారెక్టర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి నటీనటులు తమ తమ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. తెలంగాణ నేటివిటీలో ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఇప్పటికే బలగం సినిమాకు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందాయి.
భారత్ నుంచి ఆస్కార్ బరిలో నిలిచే చిత్రాల లిస్టులో కూడా బలగం స్థానం సంపాదించుకుంది.గతంలోనే నిర్మాత దిల్ రాజు (Dil Raju) బలగం సినిమాని ఆస్కార్ కి పంపే ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచింది.
22 Indian films in Oscar 2024 race : ఆస్కార్ బరిలో నిలిచిన 22 భారతీయ సినిమాలు
బలగం (Balagam), దసర(Dasara) సినిమాలతోపాటు భారత్ నుంచి ఈ సారి 22 సినిమాలు ఆస్కార్ బరిలో నిలిచాయి.
హిందీ, తమిళం, మరాఠీ, నుంచి పలు సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు సమాచారం. వాటిల్లో ది స్టోరీ టెల్లర్ (హిందీ) , మ్యూజిక్ స్కూల్ (హిందీ), 12 ఫెయిల్ (హిందీ), ఘూమర్ (హిందీ),మిస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ), గదర్-2 (హిందీ),రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ (హిందీ), జ్విగాటో అబ్ థో సాబ్ భగవాన్ భరోస్ (హిందీ),ది కేరళ స్టోరీ (మలయాళం), విడుదలై పార్ట్-1 (తమిళం), వాల్వి (మరాఠీ), బాప్ లాయక్ (మరాఠీ), చిత్రాలు ఉన్నట్లు సమాచారం.
అయితే వీటన్నింటిలో ఆస్కార్ పురస్కారాన్ని అందుకునే అవకాశం బలగం సినిమాకే ఎక్కువగా ఉందంటూ విశ్లేషకులు చెబుతున్నారు.