Alert for Ration cards holders : ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఇది అలెర్ట్.రేషన్ పంపిణి పై సీఎస్ ఏమన్నారంటే.

Add a heading 66 Alert for Ration cards holders : ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఇది అలెర్ట్.రేషన్ పంపిణి పై సీఎస్ ఏమన్నారంటే.

ఆంధ్ర ప్రదేశ్ లోని రేషన్ కార్డు ఉన్న వారికి రేషన్ ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత రేషన్ ను ఇంటింటికి పంపిణి చేసేందుకు మొబైల్ డిస్పెన్సింగ్ వెహికిల్స్ ను తీసుకొచ్చారు. ఈ వాహనాల్లో రేషన్ సరుకులను ఉంచుకుని ఇంటింటికి వెళ్లి ఆ సరుకులను పంపిణి చేసే విధంగా ఏర్పాటు చేశారు. అందుకోసం మొబైల్ డిస్పెన్సింగ్ వెహికిల్స్ ను అందుబాటులోకి తెచ్చారు. వాటి ప్రారంభోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే ఈ మొబైల్ డిస్పెన్సింగ్ వెహికిల్స్ ద్వారా రేషన్ అందించడం పై తాజాగా ముఖ్య మంత్రి కార్యాలయానికి కొన్ని ఫిర్యాదులు అందాయి. వాహనాలు తమ ఇళ్ల వద్దకు రావడం లేదని కొందరు కంప్లయింట్లు ఇచ్చారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు. ఎం.డి.ఎస్ వాహనాలకు జిపిఎస్ అమర్చాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలా చేయడం ద్వారా రేషన్ డెలివరీ, ఈ వాహనాల ద్వారా సక్రమంగా జరుగుతోందా లేదా అన్నది తెలుస్తుంది. రేషన్‌ పంపిణీ, మొబైల్‌ వాహనాల పనితీరుపై జిల్లాల సంయుక్త కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. నిత్యావసరాల పంపిణీ విషయమై జాయింట్ కలెక్టర్లు, మండల స్థాయిలో తహసీల్దార్లు ప్రతినెలా తప్పనిసరిగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. మరమ్మత్తులకు గురైన మొబైల్ డిస్పెన్సింగ్ వెహికిల్స్ ను రిపేరు చేయించడానికి, ప్రతి నెలా ఇచ్చే 18 వేల రూపాయలతోపాటు వాహన మిత్ర ద్వారా కూడా వస్తున్న డబ్బును ఉపయోగించుకోవాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. అంతే తప్ప రేషన్ సరుకుల సరఫరా మాత్రం నిలుపుదల చేయకూడదని అన్నారు. పైగా రేషన్ ఎట్టిపరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ కు వెళ్లకూడదని, ఖచ్చితంగా ప్రజలకే అందాలని చెప్పారు. ఇక మీదట రేషన్ సరుకుల విషయంలో ఫిర్యాదులు అందకూడదని, జాయింట్ కలెక్టర్లు ఈ బాధ్యతను తీసుకోవాలని చెప్పారు. వాహనాల ద్వారా ఇంటింటికీ తప్పక రేషన్‌ సరఫరా చేయాలని అన్నారు. ఒక వేళ వాహనాలు లబ్ధిదారుని ఇంటివరకు వెళ్లలేని స్థితిలో, వీధి చివరనే ఒక నోటిఫై చేసిన ప్రాంతంలో సరకులు పంపిణీ చేయాలన్నారు.

Leave a Comment