Alert Gurpatwant Singh threat Air India: బెదిరింపులు గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూన్ బెదిరింపులతో ఎయిరిండియా అప్రమత్తం.

2 2 Alert Gurpatwant Singh threat Air India: బెదిరింపులు గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూన్ బెదిరింపులతో ఎయిరిండియా అప్రమత్తం.

Alert Gurpatwant Singh threat Air India: బెదిరింపులు గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూన్ బెదిరింపులతో ఎయిరిండియా అప్రమత్తం.

ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లోకి సందర్శకులను ఈ నెల చికారివరకు అనుమతించబోరని తెలుస్తోంది. అందుకు బలమైన కారణమే ఉంది.

ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక తీవ్ర మైన ప్రకటన చేశాడు. ఈ నెల 19వ తేదీన ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ తేదీలో సిక్కులెవరూ ఎయిర్ ఇండియా ఇమానాల్లో ప్రయాణం చేయవద్దని చెప్పుకొచ్చాడు.

దీంతో పౌర విమనాయాన భద్రత విభాగం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ తోపాటు పంజాబ్ రాష్ట్రంలోని విమానాశ్రయాల్లోకి సందర్శకులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకుంది.

అంతే కాకుండా విమానాశ్రయాల్లో ప్రయాణికులను సెకండరీ చెకింగ్ చేయాలనీ కూడా నిశ్చయించింది. సెకండరీ చెకింగ్ అంటే విమానాశ్రయంలోకి వచ్చేసమయంలో చేసే చెకింగ్ కాకుండా, విమానం ఎక్కబోయే ముందు కూడా ప్రయాణికుల లగేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

దీనిని సెకండరీ చెకింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఆటంకవాదులు, తీవ్ర వాదుల దుశ్చర్యలను నిలువరించే వీలుంటుంది. ఇక సందర్శకులకు జారీ చేసే విజిటర్స్ పాస్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని పేర్కొంది.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనం సందర్శనకు ఎంట్రీ పాస్‌లు జారీ, సందర్శకుల ప్రవేశ టిక్కెట్ల అమ్మకాన్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు నవంబర్ ఆరవ తేదీనే ప్రటించారు.

అంతేకాకుండా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ఎయిర్‌స్ట్రిప్‌లు, ఎయిర్‌ఫీల్డ్‌లు, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లు, హెలిప్యాడ్‌లు, ఫ్లయింగ్ స్కూల్స్, ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్స్ వంటి పౌర విమానయాన విభాగాలకు కూడా ముప్పు ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్టు ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ వెల్లడించింది.

పన్నూన్ బెదిరింపులను కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే తీసుకుంది. కెనడాలోని ఎయిరిండియా విమానాలకు భద్రతను పెంచాలని, అదే విధంగా బెదిరింపులకు పాల్పడిన నిందితుడిపై చర్య తీసుకోవాలని కెనడాను భారత సర్కారు కోరింది.

Leave a Comment