వామ్మో…ఆలియా మెడలో మెరుస్తున్న నెక్లెస్ అన్ని కోట్లా?

WhatsApp Image 2024 04 02 at 3.33.20 PM వామ్మో…ఆలియా మెడలో మెరుస్తున్న నెక్లెస్ అన్ని కోట్లా?

లండన్‌లో అట్టహాసంగా జరిగిన హోప్ గాలా (Hope Gala)ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ (Aliya Bhatt) మెరిసింది. ఈ ఈవెంట్‌కు ఆలియా హోస్ట్‌గా వ్యవహరించింది. సలామ్ బొంబే ఫౌండేషన్ (Salaam Bombay Foundation)భారత్ లోని వెనుకబడిన వర్గాల పిల్లలకు సాయం చేయడానికి ఈ ఈవెంట్ ను నిర్వహించింది.

ఇప్పటికే ఈ ఫౌండేషన్ ముంబాయ్‌లో ఎంతోమంది చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పించి, ప్రపంచం పట్ల వారికి ఒక అవగాహనను తీసుకొచ్చింది. చిన్నారులకే కాదు యువతకు ఈ ఫౌండేషన్ ఎంతో సాయం అందిస్తోంది. ఇక ఈ ఈవెంట్‌లో ఆలియా భట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందులోనూ ఈ భామ తన మెడలో ధరించిన నెక్లెస్ హైలెట్ అయ్యింది. దీనికి సంబంధించి తాజాగా ఓ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వామ్మో రూ.20 కోట్లా :

హోప్ గాలా(Hope Gala)లో ఆలియా (Aliya Bhatt)తన లుక్ తో స్టేజ్‌ ను షేక్ చేసేసింది. ఆడియన్స్ అందరూ ఆమె అందానికి ఫిదా అయ్యారు. తన మాటలతోనే కాదు స్టైలిష్ లుక్స్ తోనూ అందరినీ కట్టిపడేసింది ఆలియా. ఈ ఈవెంట్ కోసం ఆలియా ముందుగా ఒక మెరూన్ కలర్ ఫుల్ ఫ్రాక్ వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ కు సెట్ అయ్యేలా ఒక చిన్న నెక్లెస్‌ను ధరించింది. అయితే ఈ నెక్లెస్ పై కన్నేసిన నెటిజన్స్ ధని ధర తెలుసుకుని అవాక్కయ్యారు. ఆ నెక్లెస్ ధర అలాంటిది మరి! మహా అయితే లక్షల్లో ఉంటుందనుకునేరు కానే కాదు. ఈ నెక్లెస్ ధర ఏకంగా కోట్లలో ఉంది. దీంతో ఈ నెక్లెస్ బీటౌన్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఆలియా పెట్టుకున్న నెక్లెస్ , మ్యాచింగ్ రింగ్‌ రెండూ కూడా ఇటలీకి చెందిన ఫేమస్ బ్రాండ్ బల్గారీ(Bulgari)కి చెందినవే. ఈ జ్యువలరీని ఆలియా 2.5 మిలియన్ డాలర్లు పెట్టి మరీ కొనిందని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ.20 కోట్లు అన్నమాట. చూడడానికి ఇంత చిన్నగా , సింపుల్‌గా ఉన్నా ఈ నెక్లెస్ ధర అంతనా అంటూ నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. డైమండ్ నెక్లెస్ కూడా అంత ధర పలకదని అనుకుంటున్నారు.

ప్రేమ, ప్రయోజనం అన్నీ ఉన్నాయి :

హోప్ గాలా ఈవెంట్‌ లో ఆలియా మాట్లాడుతూ..” ఇలాంటి ప్రత్యేకమైన సాయంత్రాన్ని హోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ లో ప్రేమ, ప్రయోజనం, ఆశ అన్నీ ఉన్నాయి.” అంటూ ఈ ఆలియా ఈవెంట్‌ నిర్వాహకులకు థ్యాంక్స్ చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆలియా వసన్ బాలా (Pasan Baala)డైరెక్షన్ లో ‘జిగ్రా’(Jigra)మూవీ చేస్తోంది. ఈ సినిమా హీరోయిన్ గానే కాదు ఆలయి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. 2024 సెప్టెంబర్‌లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీతో పాటు భాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bansali) తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’(Love and War)లోనూ ఆలియా హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Leave a Comment