తెలంగాణా లో మరొక ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఏడుపాయల దుర్గామాత ఆలయం. ఈ ఆలయం మెదక్ జిల్లా పాపన్న పేట మండలం నాగసాని పల్లి అనే గ్రామం లో మంజీరా నది ఒడ్డున ఉంది. ఇక్కడ ఏడు ఉపనదులు కల్సి గోదావరి నదికి ఉపనది ఆయన మాజీర నదిలో కలుస్తాయి. అందువల్లనే దీనిని ఏడుపాయల అని అంటారు.
దీనికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ మహా శివరాత్రి రోజున ఏడుపాయల వనదుర్గభావాని క్షేత్రం లో ఈ నెల 8 నుంచి 10 వరకు అంటే 3 రోజుల పటు జాతర ఉత్సవాలు బ్రహ్మాడంగా చేస్తారు. మెదక్ కు 14 కిలోమీటర్ల దూరం లో ఈ ఆలయం ఉంది. మేడారం జాతర తర్వాత జరిగే మళ్ళి అంత అంత ఘనం గ జరిగే ఉత్సవాలు ఇవే.
మంజీరా నది లో స్నానం చేసి అమ్మ వారికి బోనాలు సమర్పిస్తారు. దీనికి సంబందించి ఒక చరిత్ర కధ ఉంది. జమదగ్ని, ఆత్యయ,కాశ్యపి, విశ్వామిత్ర, వసిష్ఠ, భరద్వాజ వంటి సప్త ఋషులు ఒక యాగం తలపెట్టారు. ఆ యాగం లో పాములు అన్ని అగ్ని కి ఆహుతి అవ్వడం తో భయపడిన సర్పజాతి దేవుళ్ళను మొక్కుకున్నారు ట.
సర్పజాతికి పుణ్యలోకాలు కల్గించడం కోసం గరుఖ్మంతుడు పాతాళం లో ఉన్న గంగ ను ఇక్కడికి తీసుకువచ్చాడని అంటారు. అప్పుడే ఈ స్దలంకు గంగా నది రాగాని ఏడు పాయలుగా విడిపోయింది ట. గంగా ఏడు పాయలుగా విడిపోయింది కాబట్టి దీనికి ఏడుపాయల జాతర గా పేరు వచ్చింది అని భక్తిల విశ్వాసం.