
All India Majlis-E-Ittehadul Muslimeen : అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ.కాంగ్రెస్ నేత రాహుల్ పై ఒవైసీ ఎందుకు ఫైర్ అయ్యారు.
ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ ఎంఐఎం, ఇప్పుడు తమ ఎమ్మెల్యేలు ఉన్న ఏడు స్థానాల్లో మరలా అభ్యర్థులను నిలబెట్టి పోటీ చేస్తుందని, వాటితోపాటు, తెలంగాణలో మరో రెండు స్థానాల్లో కూడా పోటీ చేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 6 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. చాంద్రాయణగుట్ట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తారని అన్నారు.
మలక్‌పేట నుంచి బలాలా, కార్వాన్ నుంచి కౌసర్, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్, యాకుత్‌పురా స్థానంలో జాఫర్ హుస్సేన్, చార్మినార్ నుంచి జుల్ఫికర్ పోటీ చేస్తారని అన్నారు. బహదూర్‌పురా, రాజిందర్ నగర్, జూబ్లీ హిల్స్‌లో ఎవరు పోటీ చేస్తారు అన్న విషయాన్నీ ఆపార్టీ అధిష్టానం ఇంకా ప్రకటించలేదు.
అదే విధంగా ముంతాజ్ ఖాన్, పాషా క్వాద్రీ ఈ దఫా ఎన్నికల నుండి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టు అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు.
ఇక ఇదే సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను కూడా అయన తిప్పి కొట్టారు. అమెరికాతో అణు ఒప్పందంపై 2008లో యూపీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని
ఏఐఎంఐఎం కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన ప్రతి చోట అభ్యర్థులను నిలబెడుతుందన్న ఆరోపణలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాహుల్‌గాంధీ కావాలని ఓడిపోయారా, అందుకు ఎంత డబ్బు తీసుకుని ఓడిపోయారన్నది చెప్పాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అంతే కాక ఆంధ్రాలో అవిశ్వాస తీర్మానం సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఖర్చు చేశారో కూడా చెప్పాలని నిలదీశారు.
ఇక రాష్ట్రపతి పదవికి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చేలా జగన్ మోహన్ రెడ్డిని ఒప్పించడానికి తనకు ఎంత డబ్బు వచ్చింది బైట పెట్టాలన్నారు.