నాకు రాజకీయాలు వొద్దు బాబోయ్.. అల్లు అర్జున్

1 ఫోటో నాకు రాజకీయాలు వొద్దు బాబోయ్.. అల్లు అర్జున్

నంద్యాల YSRCP అభ్యర్థి శిల్ప రవికి మద్దత్తుగా మొన్న అల్లు అర్జున్ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే బన్నీ చర్యకి మెగా, పవన్ ఫాన్స్ నుండి గట్టి విమర్శలు ఎదురయ్యాయి. సోషల్ మీడియాలో బన్నీని నిఓ లెవెల్లో ఆడుకున్నారు. కానీ బన్నీ పెద్దగా స్పందించలేదు. ఈ రోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ .. తనకు రాజకీయాలు తెలియవు అన్నారు. శిల్ప రవి తనకు మొదటి నుండీ మంచిమిత్రుడు అని.. అందుకే ఆయన కోరిక మేరకు తాను నంద్యాల వెళ్ళి ప్రకారం చేసినట్లు చెప్పారు.
తాను కేవలం తన మిత్రుడు గెలుపొందేందుకే ప్రచారం చేశాను అన్నారు. రాజకీయాల్లోకి వస్తారా అన్న మాటకుఅటువంటి ఉద్దేశ్యం లేదు అన్నారు. మెగా ఫ్యామిలీ YSRCP ప్రచారం చేయలేదు కదా మీరు ఎలా చేశారు..అన్న ప్రశ్నకు .. తాను కేవలం తన చిరకాల మిత్రుడి గెలవాలన్న కోరికతో తన మిత్రుడికి మాత్రమే ప్రచారంచేసినట్లు స్పస్టం చేశారు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో వస్తున్న పుష్ప-2 పై దక్షిణాదినే కాదు ఉత్తరాదిన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. సుకుమార్ కూడా రిలీజ్ కి
తొందరపడకుండా క్వాలిటీ కోసం తపన పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ తీరుఫాన్స్ ను గందరగోళంలో పడేసే ఉంది. సినిమా కలెక్షన్లపై బన్నీ తీరు ప్రభావం చూపుతుందేమో అన్న విశ్లేషణలూ వొచ్చాయి.అయితే సోమవారం బన్నీ ఇచ్చిన వివరణతో ఫాన్స్ కొంత ఊరట చెందినట్లు సమాచారం.

Leave a Comment