Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

Allu Arjun won the Oscar full struggle story

అల్లు అర్జున్, పేరుకి ఇండస్ట్రీలో బడా నిర్మాత కొడుకే కానీ తన కష్టంతో పైకొచ్చిన టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఇండస్ట్రీలో స్టార్ హోదా అనుభవిస్తున్న ఆర్టిస్టులు ఎలా ఎదిగారు అనే విషయాన్ని బాగా దగ్గర నుండి చుసిన వ్యక్తి అల్లు అర్జున్.

అయితే అలా శ్రమను, టాలెంట్ ను నమ్ముకుని పైకొచ్చిన వాళ్లలో తన బావ మెగా స్టార్ చిరంజీవి కూడా ఒకరు, కాబట్టి ఎప్పుడైతే అల్లు అర్జున్ తనకి ఆర్టిస్ట్ కావాలనుంది, హీరో అవ్వాలని ఉంది అనే విషయాన్నీ తండ్రి దగ్గర ప్రస్తావించాడో అప్పటి నుండి ఒక సామాన్య ప్రేక్షకుడి మాదిరిగా షూటింగ్ చూసేందుకు

పంపించేవారట అల్లు అర్జున్ ని, అయితే మెగా స్టార్ చిరు సొంత మేనత్త అయిన సురేఖ భర్తే కాబట్టి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగారు, మాస్ ప్రేక్షకులను మెప్పించాలంటే ఎలా యాక్ట్ చెయ్యాలో మెగా కాంపౌండ్ వారికి బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్.

బన్నీకి ఎవరి డాన్స్ ప్రేరణ:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 3 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

అయితే నటనలో కొన్ని మెళకువలు నేర్చుకోవడానికి ఇతర నటుల సినిమాల షూటింగులకు వెళ్లి చూడామణి చెప్పేవారట అల్లు అరవింద్.

అయితే ఆ మాత్రం నటన చిరంజీవికి రాదా అయన షూటింగులకు వెళ్లొచ్చు కదా అని అనుకోవచ్చు, ఆ డౌన్స్ మీకు రావచ్చు, కానీ చిరు తన ఫాన్స్ కోరిక మేరకు నిర్మాతల శ్రేయస్సు కొరకు కేవలం మాస్ మసాలా సినిమాలకే ఓటు వేయాల్సి వచ్చింది.

అందువల్ల అన్ని రకాల సినిమాలు చేయడానికి ఆయనకు సమయం, సందర్భం కుదరలేదు. అప్పటికి రుద్రవీణ, స్వయంకృషి, శుభలేఖ, ఆరాధన, ఆపద్బాంధవుడు వంటి సినిమాలు చేశారు. అయితే అప్పటికి మెగా ఫ్యామిలీ లో ఉన్న నెక్స్ట్ జెనరేషన్ ఆర్టిస్టులు చాలా చిన్న పిల్లలు.

మరి వీరు ఎదిగి వచ్చే సమయానికి చిరు మాస్ సినిమాలతో పీక్స్ లో ఉన్నారు. కాబట్టి అల్లు అర్జున్ ను అల్లు అరవింద్ ప్రత్యేకంగా ప్రకాష్ రాజ్ వంటి వారి సినిమా షూటింగులకు పంపించేవారట. అటువంటి మేటి నటుల నటనా పటిమ చూసి పెరిగాడు అల్లు అర్జున్.

అల్లు అర్జున్ మొదటగా మెరిసింది ఏ సినిమాలో:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 4 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

ఇక అల్లు అర్జున్ ఒక్కసారిగా హీరో అయిపోలేదు, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కొడుకు, బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాబట్టి అడిగిన వెంటనే అల్లు అరవింద్, బన్నీ ను హీరోగా చేసేసి ఉంటారు అనుకుంటే పొరపాటే, ముందుగా డాన్సులు పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు

అల్లు అర్జున్, మెగా కాంపౌండ్ నుండి వస్తున్నా హీరో అంటే ముందుగా చూసేది డాన్సు గురించే, ఆ ఇంటి నుండి వస్తున్నాడు అంటే ఎంత వరకు స్టెప్పులతో ఇరగదీస్తున్నాడు అన్నదే చూస్తారు. ఎందుకంటే డాన్సులతో చిరు ఒక కొత్త ఒరవడి సృష్టించాడు తెలుగు ఇండస్ట్రీలో, బ్రేకు, షేకు, ఫోకు, క్లాసికల్ అని లేకుండా ఏది ఇస్తే అది ఇరగదీసేశాడు చిరు.

మరి ఆయన తనదైన మార్క్ క్రియేట్ చేశాక ఆ ఇంటి నుండి వచ్చే వారు, ఆయన ఎంట్రీ పాస్ తో వచ్చే వారు అందులో తక్కువ అయితే ఎలా. అందుకే అల్లు అర్జున్ చిన్నవయసు లోనే జిమ్నాస్ట్రిక్స్ కూడా నేర్చేసుకున్నాడు. ఇక డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ?

చిన్నప్పటి నుండి మేనత్త భర్త ను చూస్తూ పెరిగాడు. ఇప్పటి వరకు అల్లు అర్జున్ అంటే అల్లు అరవింద్ అని లేదంటే మెగా స్టార్ చిరు అని మాత్రమే చెప్పుకున్నాం.

అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 5 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

అన్నిటికన్నా ముఖమైంన విషయం ఏమిటంటే అల్లు అర్జున్ రక్తంలోనే నటన అనేది ఉంది. బన్నీ తాతయ్యే ఒక పెద్ద నట దిగ్గజం.

అల్లు రామలింగయ్య అనే అసామాన్య నటుడికి మనవడు అల్లు అర్జున్. అల్లు ఆరామలింగయ్యతోపాటు అనేక మంది కమెడియన్లు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ వారు కాలానుగుణంగా కనుమరుగయ్యారు.

కొందరు ఒక 10 సంవత్సరాలుంటే కొందరు 20 లేదంటే 25 అంతకు మించి అంటే 30 ఏళ్ళు, కానీ అల్లు రామలింగయ్య తన నటన తన తెలివితేటలతో దాదాపు 50 సంవత్సరాలు నటుడిగా కొనసాగుతూ వాచ్చారు.

అప్పటికి అయన ఆరోగ్యం సహకరించడం లేదని అల్లు అరవింద్ మాట మేరకు నిర్మాతలు ఆయనకు సినిమాలు ఇవ్వడం తగ్గించారు. అయితే ఈ విషయం తెలిసిన వాళ్ళు రామలింగయ్య అల్లు అరవింద్ మీద గయ్యిమని లేచేవారట.

అంటే ఆయనకు సంపాదన పట్ల అంతటి మర్యాద, నటన పట్ల అంతటి ఆరాధన ఉన్నాయని మనం అర్ధం చేసుకోవచ్చు. జ్ఞాపక శక్తి ఉన్నంతకాలం నటిస్తూనే ఉండాలని ఒక నటుడు ఎప్పుడూ కోరుకుంటాడు.

అలానే రామలింగయ్య కూడా తన శరీరం సహకరించినంత వరకు నటిస్తూనే ఉన్నారు. అయన చివరిగా చేసిన సినిమా ఇంద్రా అని చెప్పుకోవచ్చు.ఇంద్ర 2001 లో విడుదలైంది. అయితే 2003 లో విడుదలైన కల్యాణ రాముడు సినిమాలో కూడా అల్లు రామలింగయ్య స్క్రీన్ పై కనిపించి అలరించారు.

అల్లు రామలింగయ్య 50 ఏళ్ళ పాటు నటుడిగా కొనసాగడానికి కారణం అయన కేవలం కామెడీ పాత్రలకు మాత్రమే పరిమితం కాలేదు, విలనీ పత్రాలు, సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ వచ్చారు.

మరి అంతటి నట మేరున్నగం వారసుడు అంటే అల్లు అర్జున్ పై ఎంతటి స్థాయిలో ప్రెషర్ కూడా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.

ఇండస్ట్రీలో ఎదిగిన తీరు:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 8 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

ఇండస్ట్రీలో హీరో అవడం పెద్ద కష్టం ఏమి కాదు, కానీ అందరితో ఆర్టిస్ట్ అనిపించుకుని హీరోగా నిలబడటమే చాలా కష్టం. ఇక అల్లు అర్జున్ విషయానికే వస్తే ఇతను కెరియర్ ను హీరోగా మొదలు పెట్టాడని అంతా

అనుకుంటారు, కానీ అల్లు అర్జున్ డాడీ సినిమాలో ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ చేశాడు, చిరు హీరోగా వచ్చిన ఆ సినిమాలో ఒక డాన్స్ మూమెంట్ చేసాడు అల్లు అర్జున్.

2001 లో డాడి సినిమా విడుదల కాగా అల్లు అర్జున్ నటించిన గంగోత్రి 2003 లో విడుదలైంది. కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. అయితే ఎప్పుడు చెప్పుకున్నట్టు ఎంట్రీ పాస్ అనేది కేవలం మొదటి సినిమా వరకే పనికొస్తుంది.

అల్లు అర్జున్ ఆ ఎంట్రీ పాస్ ను చాలా చక్కగా, పద్దతిగా వాడుకున్నాడు. అందుకే దిల్ రాజు వంటి ప్రొడ్యూసర్ కంట్లో పడ్డాడు.

ఒక్క్కసారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక, మనల్ని మనం ప్రాజెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. దానిని అల్లు అర్జున్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అల్లు అర్జున్ లో ఉన్న ప్రధాన మైన లోపం అల్లరి, కానీ అదే అతనికి కొండంత బలం కూడా.

బన్నీ బాగా అల్లరి అబ్బాయి అంటారు, అయితే అతనిలో ఉన్న ఆ స్పీడే అతనికి ఆర్య సినిమాను తెచ్చిపెట్టింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు సుకుమార్ దర్శకత్వంలో ఆర్య సినిమాను ప్రభాస్ ను హీరోగా పెట్టి తీయాలని ప్లాం చేసుకున్నారు.

కానీ ఒక సందర్భంలో అల్లు అర్జున్ హైపర్ యాక్టీవ్ బిహేవియర్ చుసిన దర్శక నిర్మాతలు, తమ సిఇనిమలో హీరోని మార్చుకున్నారు. ప్రభాస్ ను హీరోగా పెట్టుకుంటే కధలో మార్పులు ఏమైనా చేయాల్సి వచ్చేదేమో, ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగట్టు.

కానీ కధలో మార్పులు లేకుండా ఆ సినిమాను సుకుమార్ అనుకున్నట్టు ఆయన రాసుకున్నది రాసుకున్నట్టుగా తీశారు. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్టైంది.

అల్లు అర్జున్ లోని అసలు నటుడు బయటకు వచ్చాడు. మొదటి సినిమాలో రాఘవేంద్రరావు కేవలం బన్నీని కధకోసమే అలా చూపించాడు అన్నది అర్ధం అయిపోయింది ప్రేక్షకులకు.

డైరెక్టర్స్ తో అల్లు అర్జున్ ప్రయాణం:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 6 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

ఇక టాలీవుడ్ లోకి అప్పుడే ఎంటర్ అయినా యంగ్ డైరెక్టర్స్ కి అల్లు అర్జున్ ఒక డైనమైట్ లా కనిపించాడు. విభిన్న రీతుల్లో వారు వండుకునే కధలకు అర్జున్ చక్కని మసాలాలా కలిసిపోయి కథను మరింత ఘాటెక్కించాడు.

దర్శకుడు ఒక్కసారి కథ చెబితే చాలు ఆ కధకి తగ్గట్టు తనను తాను మలచుకునే వాడు బన్నీ, అలా టాలీవుడ్ లో సిక్స్ పాక్ చేసిన మొదటి హీరో కూడా అయ్యాడు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన దేశముదురు సినిమాలో హీరోగా చేయడానికి అల్లు అర్జున్ ఒప్పుకున్నాడు. అయితే కధలో భాగంగానే సిక్స్ ప్యాక్ చేశాడు అల్లు అర్జున్.

అందుకోసం చాలా కష్టపడ్డాడు. ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జులాయి సినిమా చేశాడు. ఆ సినిమా కూడా బన్నీ క్యారెక్టర్ కి ఎక్కడో కనెక్ట్ అవుతూనే ఉంటుంది.

అయితే జులాయి గా తిరుగుతూ సెట్టింగులు పెట్టె స్వభావం కాకపోయినా, అల్లరి చేసే విషయంలో అలాగే మాటల తూటాలు పేల్చే విషయంలో దగ్గరగానే ఉంటుంది.

ఇక అల్లు అర్జున్ కెరియర్ లో తన స్వభావాన్ని బాగా దగ్గర నుండి చుసిన వారు తనతో స్నేహం బాగా కుదిరిన వారు, తనను చాలా చక్కగా డైరెక్ట్ చేయగలిగారేమో అనిపిస్తూ ఉంటుంది.

సుకుమార్ తో బన్నీ:

తన కష్టాన్ని చూస్తూ. పైకి వచ్చాను 7 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

అల్లు అర్జున్ కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ రఘవేంద్ర రావే అయినప్పటికీ, బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ మాత్రం సుకుమార్ అనే చెప్పాలి, అందుకే ఆయనతో, ఆర్య తరువాత, ఆర్య 2, పుష్ప పుష్ప 2 సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ పూరి జగనాథ్ ఆయనతో దేశముదురు సినిమా చేశాడు.

ఆతరువాత ఇద్దరమ్మాయిలతో అనే సినిమా చేశాడు. అయితే అది ఆశించిన ఫలితాన్ని యివ్వకపోయినా, మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయింది.

ఆతరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలి. మాటల మాంత్రికుడు తో జులాయి సినిమా చేశాడు, ఆతరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చేశాడు, ఆతరువాత అల వైకుంఠ పురములో చేసి హ్యాట్రిక్ కొట్టేశాడు. ఈ మూడు సినిమాలు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి బన్నీకి.

పైగా బన్నీ సినిమా అంటే ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వినిపిస్తుంది. ఇండస్ట్రీలో వీరిద్దరూ చాల మంచి ఫ్రెండ్స్.

దేవి మ్యూజిక్ డైరెక్టర్ గా కెరియర్ ఎప్పుడో మొదలు పెట్టి ఉండొచ్చు, కానీ అల్లు అర్జున్ సినిమాలతోనే దేవిశ్రీకి మంచి ఆల్బుమ్స్ ఇచ్చే అవకాశం దక్కిందని చెప్పొచ్చు.

పుష్ప కోసం ఎంత కష్టం:

88321588 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

ఇదే విషయం మనం తీసుకుంటే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమాకి అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. అలాగే దేవిశ్రీ కి కూడా ఉత్తమ సంగీత దర్శకుడిగా నేషనల్ అవార్డు దక్కింది.

ఇక హీరో అనే వ్యక్తి ఒప్పుకున్నా ప్రతి సినిమాకు ఒకే విధంగా కష్టపడతాడు, కానీ కధలోని పాత్రకు నీయం చేసేందుకు ఒక్కోసారి చాలా శ్రమించాల్సి ఉంటుంది. అలాంటి సినిమానే పుష్ప అని చెప్పుకోవాలి. ఈ సినిమాలో పుష్ప అనే కారెక్టర్ కి ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది.

అది రెగ్యులర్ హీరో కి చాల డిఫెరెంట్ గా ఉంటుంది. పైగా హీరో గ్లామరస్ గా ఉండదు, చాలా మొరటుగా మోటుగా కనిపిస్తాడు. చాలా మాసి క్యారెక్టర్ అని చెప్పాలి. ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయేందుకు అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు అని చెప్పొచ్చు.

అచ్చమైన చిత్తూరు యాసలో డైలాగులు చెప్పి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు చిత్తూరు యాసలో డైలాగులు చెప్పిన రెండవ హీరో అల్లు అర్జున్ అవుతారు.

మొదట హీరో నాచురల్ స్టార్ నాని, నాని కృష్ణార్జున సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం చిత్తూరు యాసలో మాట్లాడారు, కానీ అది ఫుల్ లెంగ్త్ గా ఉండదు. అయితే అల్లు అర్జున్ త్రూ అవుట్ ఒకే యాసను మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఇక కొన్ని కొన్ని సన్నివేశాల కోసం అడవుల్లోని షూటింగ్ చేశారు.

గ్రీన్ మాట్ తో చేసి గ్రాఫిక్స్ తో నింపేయొచ్చు కానీ రియలిస్టిక్ గా ఉండటం కోసం అడవుల్లో షూటింగ్ చేస్తూ చాల కష్టపడ్డారు. ఆకష్టానికి ఫలితం బన్నీకి అవార్డు రూపంలో దక్కింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు రావడం అనేది సామాన్య విషయంకాదు.

జాతీయ ఉత్తమ నటుడు ఏమన్నాడంటే:

Allu Arjun 2 1 Allu Arjun won the Oscar full struggle story:తన కష్టాన్ని చూస్తూ.. పైకి వచ్చాను అంటున్న అల్లు అర్జున్.

అయితే ఈ అవార్డు తీసుకున్న అల్లు అర్జున్ ఒక పార్టీ ఆరెంజ్ చేశాడు ఆ పార్టీకి వచ్చిన ప్రకాష్ రాజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దల పై కొన్ని కామెంట్స్ చేశాడు.

అర్జున్ కి అవార్డు వచ్చిందంటే అది తెలుగు ఇండస్ట్రీకి వచ్చినట్టే అని, అందుకు అతడిని అభినందించడానికి ఇండస్ట్రీలో పెద్దలు రాకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అయితే ప్రకాష్ రాజ్ కి అంతఃపురం సినిమా కి గాను ఉత్తమ సహాయనటుడిగా అవార్డు దక్కింది.

ఆ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశి రూపొందించాడు. సౌందర్య, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఆ సినిమాలో జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించారు.

తెలుగులో ఉత్తమ చిత్రం గా ఎన్టీఆర్ తెరకెక్కించిన సీతారామ కళ్యాణం సినిమా ఎంపికైంది. అలాగే మరి కొన్ని సినిమాలకు ఈ అవకాశం దక్కింది, కానీ తెలుగు నుండి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న వారిలో అల్లు అర్జున్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.

Leave a Comment