‘లుట్ ఫుట్ గయా’ పాట పాడిన అల్లు అయాన్.. ఫిదా అంటూ షారుక్ ట్వీట్

website 6tvnews template 2024 02 26T122627.393 'లుట్ ఫుట్ గయా' పాట పాడిన అల్లు అయాన్.. ఫిదా అంటూ షారుక్ ట్వీట్

Allu arjun son allu ayaan sang shahrukh khan dunki song : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వింతలు, విషయాలు అన్నీ అరచేతిలో ప్రత్యక్షమవుతున్నాయి. సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ ను పెంచుకుంటూ అభిననులను అలరిస్తున్నారు. సెలబ్రిటీలే కాదు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నెట్టింట్లో యాక్టీవ్ గా ఉంటున్నారు. స్టార్ కిడ్స్ లో అల్లు అర్జున్ (Allu Arjun) పిల్లలు ఎప్పుడూ ముందు మనసులోనే ఉంటారు.

అటు బన్నీ ఇటు అతని భార్య అల్లు స్నేహ(Sneha).. వారి పిల్లలు అయాన్ (Ayaan), అర్హ (Arhan ) ల లేటెస్ట్ ఫోటోలు, వీడియోల ఎప్పటికప్పుడు నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటాయి. సమంత (Samantha) నటించిన శాకుంతలం ( Shakuntalam ) సినిమాలో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. భరతుడి క్యారెక్టర్ లో క్యూట్ పెర్ఫార్మన్స్ తో అలరించింది.

shahrukh khan tweets on Alluarjun son singing Dunki song.

షారుక్ పాట పాడిన అల్లు అయాన్ :

అల్లు అయాన్ (Allu Ayaan ) కూడా తన అల్లరితో నెట్టింట్లో వైరల్ అవుతుంటాడు. అయాన్ చిలిపి పనులకు బన్నీ ఫ్యాన్స్ తో పాటు నేటిజన్స్ ఫిదా అవుతుంటారు. లేటెస్ట్ గా అయాన్ కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయాన్ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Sharukh Khan ) లేటెస్ట్ గా రిలీజ్ అయిన మూవీ డంకీ (Dunki )లోని ‘లుట్ ఫుట్ గయా’ పాట పాడి ఆదరగోట్టాడు. అయాన్ సరదాకి కారులో పాట పాడినా.. ఆ పాట నెట్ లో వైరల్ అయ్యింది. బన్నీ ఫ్యాన్స్ ‘ఫ్యూచర్ ఐకాన్ స్టార్’అంటూ అయాన్ ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ వీడియో కాస్త షారుక్ ఖాన్ వరకు చేరింది. షారుక్ కూడా వెంటనే అయాన్ కు రిప్లై కూడా ఇచ్చాడు.

Ayann 1708825800 'లుట్ ఫుట్ గయా' పాట పాడిన అల్లు అయాన్.. ఫిదా అంటూ షారుక్ ట్వీట్

అయాన్ పాటకి షారుక్ ఫిదా :

షారుక్ ఖాన్ (Sharukh Khan ) ట్విట్టర్ లో అయాన్ ( Ayaan ) పాట విని ఫిదా అయ్యాడు. ట్విట్టర్ వేదికగా వెంటనే అయాన్ కు రిప్లై ఇచ్చాడు.” థ్యాంక్యూ లిటిల్ వన్.. యూ ఆర్ ఫ్లవర్ అండ్ ఫైర్ కలగలిసిన ఒకడివి. ఇప్పుడు నా పిల్లలకి కూడా అల్లు అర్జున్( Allu Arjun) శ్రీవల్లి సాంగ్ పాడటం నేర్పిస్తాను. .. హా.. హా” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీ కూడా షారుక్ చేసిన ట్వీట్స్ కి రిప్లై ఇచ్చాడు. “షారుఖ్ జీ.. సో స్వీట్ ఆఫ్ యూ, లాట్స్ ఆఫ్ లవ్” అంటూ రిప్లై ఇచ్చాడు.

Leave a Comment