Kalpalatha: అల్లు అర్జున్ చెల్లెలి నిశ్చితార్ధం.
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇక సీనియర్ నటుల విషయానికి వస్తే వల్ల పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తూ కొత్త జీవితాలకి నాంది అవుతున్నారు.
ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మరికొంత మంది నిశ్చితార్థం చేసుకొని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చెల్లెలు కూడా పెళ్లి చేసుకుంటుందని ఈ మధ్యలో వార్తలు బాగా వస్తున్నాయి.
అయితే అల్లు అర్జున్ కి చెల్లెలే లేదు కదా, మరి పెళ్లి ఏంటి అన్న అనుమానం రావచ్చు, అల్లు అర్జున్ చెల్లెలు అంటే అంటే ఆయన హీరోగా నటించిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి తల్లిగా నటించిన కల్పలత కూతురు.
పుష్ప సినిమా ప్రమోషన్లలో ఆమె పలు ఇంటర్వ్యూలలో అందరికీ పలకరించింది. ఈ క్రమలోనే తన కొడుకుగా చేస్తున్న అల్లు అర్జున్ తన కన్నా రెండు సంవత్సరాలే చిన్నవాడని తెలిసి ఆశ్చర్యపోయారు.
ఈమెకి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని వీళ్ళు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారని, ఆమె చెప్పారు. ఇక ఈ క్రమంలోనే ఆమె పెద్ద కూతురి నిశ్చితార్థం ఈ మధ్య జరిగినది.
ఈ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయ్యాయి. దీనితో అందరూ అల్లు అర్జున్ చెల్లెలీ నిషితార్థం అంటూ కామెంట్ లు పెడుతున్నారు.
ఈ నిశ్చితార్థానికి చాలా మంది సినీప్రముఖులు హాజరైనట్టు తెలుస్తుంది. పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ కూడా ఈ నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాల్పలత రెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యారు.