Allu Arjun movie with Atlee Confirmed?: అట్లీ సినిమా తో అల్లుఅర్జున్.
జవాన్ దర్శకుడు పుష్ప నటుడితో ఎంటర్టైన్ చేయనున్నాడా..?
జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అట్లీ.బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో అత్యంత అరుదైన ఘనత సాధించిన సినిమా చిత్రీకరించాడు అట్లీ.
ఈ సినిమా తరువాత అట్లీ తో సినిమాలు చేసేందుకు పలువురు సెలెబ్రెటీలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక అట్లీ పుష్ప నటుడు, పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా అంతర్గత సమాచారం.
అట్లీతో అల్లు అర్జున్:
అట్లీ తన తదుపరి చిత్రం కోసం అల్లు అర్జున్ ని సంప్రదీస్తున్నట్టు సమాచారం. ఐకాన్ స్టార్ ని మరో కొత్త కోణంలో చూపించేందుకు చర్చలు సాగుతున్నాయి.
2024 చివరి త్రైమాసికంలో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలు ఉన్నాయని తెలుస్తుంది.
ఇద్దరు కలిసి భారీ కమర్షియల్ హిట్ తో ముందుకి రానున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ చేతిలో “పుష్ప 2” భారీ ప్రాజెక్టు ఉంది. ఇక 2025 లో త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో చేసే ప్రాజెక్టు కోసం లైన్ లో ఉన్నాడు.
అట్లీ తో అల్లు అర్జున్ చేయాలంటే అధి 2024 చివరి త్రైమాసికంలోనే.ఇక సన్ పిక్చర్స్ వాళ్ళు అట్లి తీయబోయే చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దంగా ఉన్నట్టు సమాచారం.
ఇదంతా అంతర్గత సమాచారం, అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటనా ఇవ్వలేదు.