విజయవాడలో అంబేద్కర్ : Ambedkar statue in Vijayawada
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు విజయవాడలో ఉన్న పీడబ్ల్యూడీ మైదానంలో 210 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఆవిష్కరణ అనంతరం అక్కడి ప్రాంతాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పిలుస్తారు.
అంబేద్కర్ విగ్రహం వివరాలు :
- మొత్తం విగ్రహం ఎత్తు : 210 అడుగులు
- అసలు విగ్రహం ఎత్తు : 125 అడుగులు
- పీఠం ఎత్తు : 85 అడుగులు
విగ్రహం ఎత్తు 125 అడుగులయితే, విగ్రహం కోసం నిర్మించిన పీఠం ఎత్తు 85 అడుగులు. ఇందువల్ల అంబేద్కర్ విగ్రహం 210 అడుగులు అయింది.
ఈ అంబేద్కర్ విగ్రహం దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా రికార్డు సృష్టించనుంది.
ప్రాజెక్టు వివరాలు :
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 18 ఎకరాల్లో ఈ స్మృతివనం ప్రాజెక్టు మొదలుపెట్టింది.
170 కోట్లతో ఈ ప్రాజెక్టుని మొదలుపెడితే, పూర్తయ్యేసరికి 404.35 కోట్లతో పూర్తయింది.
దీని నిర్మాణం హైదరాబాద్‌కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వారు చేపట్టారు.
డిసెంబర్ 21 2021 లో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దాదాపు రెండేళ్ళు కష్టపడి దీనిని నిర్మించారు.