Ambulance Scarcity in uttar pradesh yogi govt fires : అంబులెన్స్‌ల కొరతపై చర్యలు తీసుకున్న యోగి ప్రభుత్వం, సోదరుడు సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు.

18 2 Ambulance Scarcity in uttar pradesh yogi govt fires : అంబులెన్స్‌ల కొరతపై చర్యలు తీసుకున్న యోగి ప్రభుత్వం, సోదరుడు సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు.

Ambulance Scarcity : అంబులెన్స్‌ల కొరతపై చర్యలు తీసుకున్న యోగి ప్రభుత్వం, సోదరుడు సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు

ఉత్తర్ ప్రదేశ్ లోని ఔరైయా జిల్లాలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. చనిపోయిన యువతిని ఆమెకు స్వయంగా తోడబుట్టిన సోదరుడు బైక్ పై తీసుకువెళ్లడం చూపరులను కన్నీరు పెట్టిస్తోంది. ఒకే తల్లి కడుపున పుట్టిన ఎవరైనా సరే ఒకరికి కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. వారికి చిన్న కష్టం వచ్చినా అండగా నిలబడతారు. అటువంటిది వారి ప్రాణాల మీదకు వచ్చిందంటే మాత్రం వారు అనుభవించే బాధ వర్ణనాతీతం. ఔరైయా జిల్లాలో నవీన్‌ బస్తీకి చెందిన ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి కుమార్తె అంజలి అనుకోకుండా వాటర్‌ హీటర్‌ను ముట్టుకుంది. దీంతో విద్యుత్ షాక్‌‌కు గురైన ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను బిధునా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

కానీ విధివశాత్తు అంజలి అప్పటికే మరణించింది. ఆమె ను పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు చనిపోయినట్టు నిర్ధారించారు. కాగా అంజలి సోదరుడు తన చెల్లెలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి ఒక అంబులెన్స్ ఏర్పాటుచేయమని అర్ధించాడు. అందుకు ఆసుపత్రి యాజమాన్యం ససేమిరా ఒప్పుకోలేదు. అంబులెన్స్ లేదని తేల్చిచెప్పింది. దిక్కుతోచని పరిస్థితుల్లో అంజలి సోదరుడు ఆకాష్, సోదరి మరణ దుఃఖాన్ని పంటి కిందే అదిమిపట్టి, ఆమెను చున్నీ సాయంతో నడుముకి కట్టుకుని బైక్ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇక అంజలి వెనుక ఆధారం కోసం మరో మహిళ కూర్చుంది. అలా ముగ్గురు ఒకే బైక్ పై ఇంటికి వెళ్లారు. అంబులెన్స్ ఉంటె గనుక వారికి ఈ స్థితి దాపురించేది కాదని తెలుస్తోంది. గుండెలు పగిలే దుఃఖాన్ని ఆపుకుంటూ చెల్లెలి మృతదేహాన్ని బైక్ పై తీసుకు వెళుతున్న అతడి కష్టాన్ని చూసిన వారు చలించిపోయారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో అనేక విమర్శలకు తావిస్తోంది. నెటిజన్లు ఆసుపత్రి సిబ్బంది పై తీవ్రంగా మండి పడుతున్నారు.

ఈ వీడియో వైరల్ కావడంతో అధికారుల దృష్టికి చేరింది. దీంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులను సాస్పెండ్ చేశారు. ఆస్పత్రిలో ఎవరైనా చనిపోతే.. మృతదేహాన్ని తరలించేందుకు, వారి బంధువులు అంబులెన్స్ అడిగితే తప్పకుండా ఏర్పాటుచేయాలని స్పష్టం చేశారు. ఈ ఘటనతో యోగి ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గు మంటున్నాయి. అయితే ఇది కేవలం ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రమే కాదు, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఒకప్పుడు ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి.

Leave a Comment