America New Restrictions on Student Visa: స్టూడెంట్ వీసాపై అమెరికా కొత్త నిభంధనలు.
స్టూడెంట్ US వీసాపై అమెరికా ఎంబసీ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనలు అపాయింట్మెంట్ సిస్టమ్ లో జరిగే తప్పులను నిరోధించడానికి US తీసుకొచ్చింది.
సోమవారం నుండి ఆ నిభంధనలు అమలులోకి వచ్చాయి. US లో చదువుకోవాలనుకుంటున్న ప్రతి భారతీయ విద్యార్థికి గమనించాల్సిన విషయం. వీసా దరఖాస్తుకు ముందే కొత్త నిభంధనలు గమనించాలి.
స్టూడెంట్ విసాల దరఖాస్తుకు ఆమెరికా ఎంబసీ చేసిన కొత్త నిభందనలు నవంబర్ 27 నుంచి అమలులో కి వచ్చాయి. ఈ నిభంధనలను విధ్యార్థులు గుర్తుపెట్టుకోవాలని అమెరికా ఎంబసీ వెల్లడించింది.
Regulations issued by US Embassy:
వీసా దరఖాస్తు చేసే అభ్యర్థులు వారి స్వంత సమాచారాన్నే వెబ్ సైట్ లో ఉపయోగించాలి. ప్రొఫైల్ తయారు చేసేటప్పుడు, వీసా అపాయింట్మెంట్ కోసం తప్పుడు వివరాల్ని ఇచ్చినట్టుగా ఉంటే అక్కడే ఆ అప్లికేషన్ ని వెనక్కి పంపిస్తారు.
దానితో పాటు వారి అపాయింట్మెంట్ రద్దు చచేస్తారు, అభ్యర్థులు చెల్లించిన ఫీజు కూడా తిరిగి రాదు.
మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలంటే, కొత్త ప్రొఫైల్ క్రియేట్ చేసి, మళ్ళీ ఫీజు చెల్లించి, సరైన వివరాలతో అప్లై చేసుకోవలసి ఉంటుంది.
పాస్ పోర్ట్ పోయినా, దొంగతనానికి గురి అయినా, పాస్ పోర్టును కొత్తగా రెన్యూ చేసుకున్నా, వాళ్ళు ఫోటో కాపీ లేదా డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ అందించాలి. అప్పుడే ఆ అప్లికేషన్ ను పరిశీలించేందుకు అనుమతి లభిస్తుంది.
ఎఫ్, ఏమ్ వీసాల కోసం అప్లై చేసేవారు స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ వాళ్ళు సర్టిఫై చేసిన ప్రోగ్రామ్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి. జె వీసా కావాలనుకునేవారు దరఖాస్తు కొసం ఏదైనా అమెరికా విదేశాంగ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్ షిప్ పొందాలి.
ఎఫ్, ఎమ్ స్టూడెంట్ వీసాలు రకరకాల విద్యా కార్యక్రమలో పాల్గొనే వారికోసం USA జారీ చేసిన వీసాల యొక్క రకాలు, వీటిలో ఎఫ్ వీసా అనేది కాలేజీ, యూనివర్సిటీ, హై స్కూల్, సెమినరీ, కన్జేటరీ చేసే వారికోసం.
F1 visas:
ఎఫ్ 1 వీసా ఉన్న హోల్డర్స్ పైన ఆధారపడే వారికి ఎఫ్ 2 వీసాలు ఉంటాయి.ఏమ్ వీసా అనేది చదువు, బాషా తో సంభందం లేకుండా నాన్ అకడెమిక్ లలో అప్లై చేసుకునే వ్యక్తుల కోసం. వృత్తి విధ్యార్థుల కోసం ఎమ్ 1 వీసాలు , ఎమ్ 2 వీసాలు ఎమ్ 1 వారిపై ఆధార పడిన వారికి.
జె వీసా; ఇది అమెరికాలో ఎక్స్ఛేంజి విసిటింగ్ కార్యక్రమాలలో పాల్గొనే వారికోసం. దీనిలో విధ్యార్థులు, ప్రొఫెసర్ లు, ట్రైనీలు,ఇంటర్న్ లు, రకరకాల కార్యక్రమాలలో పాల్గొనే వాళ్ళు ఉండవచ్చు.
జె 1 ప్రాథమిక విసిటర్ల కొసం జారీ చేయబడతాయి, జె 2 వారిపై ఆధారపడేవారికోసం.
ఓపెన్ డోర్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిన విధ్యార్థుల సంఖ్య 35 శాతం పెరిగింది.
యునైటెడ్ స్టేట్స్ లోని మిలియన్ విధ్యార్థుల్లో భారతీయులే 25శాతం ఉన్నారు. 2022 -23 సంవత్సరంలో ఈ సంఖ్య 268,923 కి చేరుకుంది.
భారత దేశంలో వీసా కోసం ఎదురు చూసే సమయాన్ని తగ్గించి, ఈ వీసా పనులు వేగవంతం చేసేందుకు US చర్యలు తీసుకుంటున్నట్టుగా US రాయబారి అయిన ఎరిక్ గర్సెట్టి వివరించారు.
ఈ స్టూడెంట్ వీసా అప్లికేషన్ లు ఇప్పటికే ఎన్నో సమస్యలతో కూడి ఉన్నవి.కొత్తగా వీసా కి అప్లై చేయాలంటే కొత్త CAS ని యూనివర్సిటీ నుండి పొందాలి. వేరే దేశానికి వెళ్ళే ముందే వీసా యొక్క పూర్తి గడువుని పరిశీలించాలి.
వీసా అనేది ఇతర దేశంలో మనం ఉండడానికి అనుమతిని ఇచ్చే ఏకైక పత్రం. వాస్తవానికి ఇతర దేశానికి వెళ్ళే కారణాన్ని బట్టి రకరకల వీసాలు పొందవచ్చు.
వీసాలో ఎలాంటి వివరాలు అసంపూర్ణంగా ఉన్నా, ధరఖాస్తు చేసే ఫోరంలో ఎలాంటి కాళీలు ఉన్నా,డాక్యుమెంట్లు సరిగా లేకపోయినా, ఇలా ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే తిరస్కరించడానికి అవకాశం ఉంది.
ప్రయాణానికి ప్రయాణికుడి వద్ద ఎంత డబ్బు ఉన్నదన్న విషయాన్ని కూడా సిబ్బంది ముందుగానే చూస్తుంది, ప్రయాణానికి, అక్కడ బస చేయడానికి, తిరిగి స్వంత దేశానికి రావడానికి ఇలా అన్నీ రకాలుగా చూసిన తరవాతనే వీసా అనేది మంజూరు చేయడం జరుగుతుంది.
ఇంతకు ముందు ఉన్న వీసా గడువుకి మించి వేరే దేశంలో ఉన్నట్టుగా కనపడితే తిరస్కరించే అవకాశం ఉంది, ఎందుకంటే చట్ట విరుద్దంగా ఇంతకుముందు వల్ల దేశంలో ఉన్నవాళ్ళు, మళ్ళీ అదే విధంగా చేయవచ్చు, లేదా చట్ట విరుద్దంగా అక్కడే స్థిరపడే అవకాశం కూడా ఉంది.
స్వంత దేశంలో ఏవైనా నేరారోపణలు ఉన్నట్టయితే ఆ వీసా దరఖాస్తును నిరాకరించవచ్చు. మీరు వారి పౌరులకు ముప్పుగా అనుకోని తిరస్కరిచే అవకాశం ఉంది.