Sensational on H-1B visa reform: H-1B వీసా పునరుద్దరణ పై అమెరికా సంచలన మార్పు.. సంతోషంలో H-1B వీసాదారులు.

America's sensational change on H-1B visa reform.. Happy H-1B visa holders.

Sensational on H-1B visa reform: H-1B వీసా పునరుద్దరణ పై అమెరికా సంచలన మార్పు.. సంతోషంలో H-1B వీసాదారులు.

అమెరికాలో ఉన్న కంపెనీలలో ప్రముఖ విదేశీ నిపుణులను నియమించుకుంటారు. అయితే ప్రక్రియకు హెచ్ -1 బీ వీసా సహాయం కల్పిస్తుంది.

ఈ నియామకాల్లో భారతీయులే అధికంగా ఉండటం వాళ్ళ, ఈ హెచ్-1 బీ వీసా కూడా భారతీయులే ఉపయోగిస్తున్నారు.

ఇంతకుముందు అయితే ఈ వీసా పునరుద్ధరణ కోసం అమెరికాని వదిలి వెళ్లి పునరుద్ధరణ చేసుకొని రావలసిన పరిస్థితి 2004 వరకు లేదు.ఆ తర్వాత ఈ ప్రక్రియల్లో మార్పులు చేసారు.

హెచ్-1 బీ వీసా ఉన్న వాళ్ళు రెన్యూవల్ కోసం, స్టాంపింగ్ కోసం సొంత దేశానికీ వెళ్లి రావలసి వచ్చేది.
కొన్ని సార్లు ఈ స్టాంపింగ్, వీసా పొడగింపు ప్రక్రియ చాలా ఆలస్యం అయ్యేది.

ఈ వీసా అపాయ్నట్మెంట్ కోసం చాలా రోజులు, నెలలు ఎదురు చూడాల్సి వచ్చేది.
అలాంటి వాళ్ళ సమస్యలని దృష్టిలో ఉంచుకొని, ఈ డొమెస్టిక్ వర్క్ వీసా రెన్యూవల్ ప్రోగ్రాంని ప్రవేశపెట్టింది.

ఈ డిసెంబర్ నుంచి ఒక కొత్త పైలెట్ ప్రోగ్రాంని ప్రవేశపెడుతోంది, దీనివల్ల అమెరికాలో పనిచేస్తుంన్నా విదేశస్థులకు, స్వదేశాలకు వెళ్లకుండానే వారి హెచ్-1 బి వీసాలను రెన్యూవల్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ వీసాల పునరుద్ధరణ కోసం అమెరికా ప్రభుత్వం ఈ సరళీకరణ పద్దతిని ప్రవేశపెట్టబోతుంది. కొన్ని రకాల హెచ్-1బి వీసాలను రెన్యూవల్ చేసే ఒక పైలెట్ ప్రోగ్రాంని ఈ డిసెంబర్ లో ప్రవేశపెడుతున్నారు.

ఈ ప్రోగ్రామ్ మూడు నెలలపాటు సాగె అవకాశం ఉంది. ముందుగా ఇరవైవేల మందికి ఈ పైలెట్ ప్రోగ్రాం కింద వీసా రెన్యూవల్ చేయనున్నారని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ తెలియజేసారు.

విదేశీ నిపుణులలో అత్యధికంగా భారతీయులే ఉన్నారని, ఈ ప్రోగ్రాం వాళ్ళ భారతీయులే ఎక్కువ లబ్ది పొందుతారని ఆమె వెల్లడించింది.

ఇప్పటికైతే ఈ వీసాలు హెచ్-1బి వర్క్ విసాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా వెల్లడించారు.
చదువు కోసం, ఉద్యోగాల కోసం, రీసెర్చ్ ల కోసం అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.

పోయిన ఏడాది రికార్డు స్థాయిలో 1,40,000 లకు పైగా విద్యార్థులకు వీసాలు జారీ చేసారని జూలీ వివరణ ఇచ్చారు.ఇక భారతీయులకు వీసా కోసం ఎదురుచూసే సమయాన్ని కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు.

Leave a Comment