Amitabh unfollowed Aishwarya Rai : కోడలిని అన్‌ఫాలో చేసిన అమితాబ్ ?అయితే డివోర్స్ కన్ఫార్మ్ అయినట్టేనా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ , నటుడు అభిషేక్ బచ్చన్ల డివోర్స్ పక్కానా? బాలీవుడ్ లో కొన్నాళ్లుగా వినిపిస్తున్న రూమర్స్ నిజమైనట్లేనా?
బాలీవుడ్ బిగ్ బీ ఐశ్వర్య మామ అమితాబ్ బచ్చన్ చేసిన ఈ ఒక్క పనితో కొడుకు , కోడలి విడాకుల విషయంపై క్లారిటీ ఇచ్చినట్లేనా? అంటే అవుననే అంటోంది బాలీవుడ్. సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ని అన్ ఫాలో చేసి అందరిని షాక్‌కి గురిచేశారు.
కొన్ని రోజులుగా ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో స్టార్ నటి ఐశ్వర్య , హీరో అభిషేక్ బచ్చన్ లు డివోర్స్ తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా గత రెండేళ్ల నుంచి ఈ రూమర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
అయితే అనేకసార్లు ఈ వార్త ఫేక్ అని ఈ కపుల్స్ రుజువు కూడా చేశారు. మళ్లీ మూడు నెలల నుంచి ఈ టాపిక్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం ఈ రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మరి ఇంతలా ఈ వార్త ట్రెండ్ కావడానికి కారణం లేకపోలేదు. ఈ కపుల్స్ బిహేవియరే అందుకు కారణమని కొంతమంది విశ్లేషిస్తున్నారు. బాలీవుడ్ లో జరిగే టాప్ మోస్ట్ ఫంక్షన్లకు ఇద్దరు కలిసి రాకపోవడం, ఒకవేళ ఇద్దరూ కలిసి ఈవెంట్ కు వచ్చినా మొక్కుబడిగా వచ్చి వెళ్లడం.
అభిషేక్ భార్య ఐశ్వర్య ను అసలు పట్టించుకోకపోవడం కారణాలుగా చెప్పవచ్చు. అయితే తాజాగా అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య ని అన్ ఫాలో చేసి డివోర్స్‌కు అన్ అఫీషియల్‌గా కన్ఫామ్ చేశారు.
పెళ్లైనప్పటి నుంచి ఐశ్వర్యకు అమితాబచ్చన్ కుటుంబానికి పెద్దగా వర్కౌట్ కావడంలేదన్న పుకార్లు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే మంత్రముగ్ధులను చేసే కెమిస్ట్రీకి పేరుగాంచిన అభిషేక్ , ఐశ్వర్యకు మధ్య వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా అమితాబ్ ఐశ్వర్యను అన్ ఫాలో చేయడంతో డైవోర్స్ న్యూస్‌కు బలం చేకూర్చినట్లైంది. వాస్తవానికి స్టార్ సెలబ్రిటీలు విడాకులు తీసుకునే ముందు ఇలాగే సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తున్నారు.
అమితాబచ్చన్ కూడా అందుకు తగ్గట్లుగానే ఐశ్వర్యరాయ్‌ను అన్ ఫాలో చేయడంతో దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. దీంతో అభిమానులు, నెటిజన్స్ వారి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఎన్ని వివాదాలు ఈ కపుల్ ని చుట్టిముట్టినప్పటికీ కెమెరా ముందు అప్పుడప్పులు కలిసి కనిపిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ వారసుడు అగస్త్య నందాకు
సపోర్ట్ గా ఐశ్వర్య, అభిషేక్ ది ఆర్చీస్ స్క్రీనింగ్‌లో బ్లాక్ అవుట్ ఫిట్స్ వేసుకుని కూతురితో కలిసివచ్చి స్టైలిష్ లుక్స్ లో కనిపించారు. కూతురు ఆరాధ్య, అమితాబ్ బచ్చన్ తో పాటు ఈ ఈవెంట్ కు వచ్చి సందడి చేశారు. ఈవెంట్ కు అయితే కలిసి వచ్చారు
కానీ వారి తీరును గమనిస్తే మాత్రం అభిమానులకు కాస్త అసాధారణంగా కనిపించింది. ఏమైనప్పటికీ, నిన్నటి ఈవెంట్ నుండి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటికి తోడు అబితాబ్ ఐష్ ను అన్ ఫాలో చేయడంత మళ్లీ డివోర్స్ అంశం తెరముందుకు వచ్చింది.
అమితాబ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఐశ్వర్య రాయ్ ను అన్ ఫాలో అయ్యారన్న విషయాన్ని నెటిజన్లు కనుక్కున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా యూజర్స్ ఎత్తి చూపారు.
సోషల్ మీడియా ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నప్పటికీ వారి రిలేషన్ గురించి ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ధృవీకరణ ఇవ్వలేదన్నది గమనించాల్సిన విషయం. మరి ఇప్పటికైనా ఈ పుకార్లపై ఈ జంట క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది.