పిల్ల బ‌చ్చాలకు నో ఎంట్రీ- భయపెడుతున్న తంత్ర

website 6tvnews template 93 పిల్ల బ‌చ్చాలకు నో ఎంట్రీ- భయపెడుతున్న తంత్ర

ananya nagella tantra movie post viral : అనన్య నాగళ్ల (Ananya Nagella) మూవీస్ అంటే చాలా మందికి గ్లామర్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఈసారి ఈ ముద్దుగుమ్మ రొటీన్ కు భిన్నంగా అందరిని భయపెట్టేందుకు రెడీ అవుతోంది. తంత్ర (Tantra ) అంటూ థియేటర్లో జనాలను వణికించాలని డిసైడ్ అయ్యింది. అన‌న్య నాగళ్ల లేటెస్ట్ గా నటించిన తంత్ర మూవీ మార్చి 15న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా ఈ మూవీ పూర్తి చేసుకుంది.

ఈ మూవీ కి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇదే విషయాన్ని కాస్త భిన్నంగా తంత్ర మూవీ టీం ప్రమోట్ చేస్తోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌ను కాస్త వెరైటీగా వదిలారు. పిల్ల బచ్చాలు తంత్ర సినిమాకు రావొద్దు అంటూ హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. తంత్ర మూవీ గురించి చర్చ జరుగుతోంది.

పిల్ల బ‌చ్చాలకు నో ఎంట్రీ :

శ్రీనివాస్ గోపిశెట్టి (Srinivas Gopishetty )డైరెక్షన్ లో త్వరలో రిలీజ్ కాబోతున్న మూవీ తంత్ర (Tantra ) . అన‌న్య నాగళ్ల (Ananya Nagella)కీ రోల్ ప్రోషిస్తోంది. మర్యాదరామన్న (Maryadaramanna ) ఫేం సలోని ( Saloni ) , టెంపర్ వంశీ (Temper Vamsi ), మీసాల లక్ష్మణ్ (Meesala Lakshman )+లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీం వెరైటీగా ప్రమోషన్ చేస్తోంది. ఇన్ స్టాలో తాజాగా తంత్ర టీం పోస్ట్ అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. మరి ముఖ్యంగా మూవీ టీమ్ ఇస్తున్న రిప్లైలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లతో ఫన్నీగా ఇంటరాక్ట్ అవుతున్న తీరు కొత్తగా ఉంది. తన సినిమాను వినూత్న రీతిలో ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఈ పోస్టులో ఏముందంటే.. “టెడ్డీబేర్‌కి మీరు జోలపాడితే బాగుంటుంది.. కానీ అదే టెడ్డీబేర్ మీకు జోల పాడితే.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా! అలాంటిదే ఈ ‘తంత్ర’ మూవీ . మార్చి 15న రిలీజ్ అవుతోంది మీరు రెడీ నా? అంటున్న ఈ పోస్ట్ వణుకుపుట్టిస్తోంది.

ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్

‘తంత్ర’ (Tantra )ఫస్ట్ లుక్ ప్రజల్లో భ‌యాన్ని పుట్టిస్తోంది. ఈ ఫస్ట్ లుక్ లో అనన్యా నాగళ్ల(Ananya Nagella) కనిపించింది. ఈ పోస్టర్ తోనే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసాడు డైరెక్టర్. భారతీయ ‘తంత్ర’ శాస్త్రానికి చెందిన సీక్రెట్స్ ను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్‌ ఎంటర్‌టైనర్ గా ఈ మూవీ థియేటర్ లలోకి రాబోతోంది. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Leave a Comment