Ananya pande: లైగర్(Liger) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే(Ananya Pande). వివాదాలను ఎల్లప్పుడూ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతుందా అన్నట్టు ఉంటుంది ఈ అమ్మడు వ్యవహారం.
ఈ నాజూకు అందాల చిన్నది సినిమా నేపధ్యం ఉన్న కుటుంబం నుండే వచ్చింది. ఈమె తండ్రి చుంకి పాండే(Chunki pande). హిందీ సినిమా నటుడు. దాదాపు 100 కి పైగా సినిమాల్లో నటించాడు.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్(Student Of The year) సినిమాతో 2019 లో ఆరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఇప్పటివరకు 8 సినిమాల్లో నటించింది.
మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిమేల్ డెబ్యూట్ గా ఫిలిం ఫేర్ అవార్డు(Filim Fare Award)ను సొంతం చేసుకుంది. అయినా ఇప్పుడు ఈ అమ్మడు గురించి అంతలా ఎందుకు చెబుతున్నానా అని సందేహం రావచ్చు.
మరేం లేదండి, ఈ బేబీ నెటిజన్లపై తెగ ఫయిర్ అవుతోంది. సోషల్ మీడియా లో ట్రోలింగ్ చేసేవాళ్లపై చిర్రుబుర్రులాడుతోంది ఈ సొగసరి.
సామజిక మాధ్యమాలలో కొంతమంది పనిగట్టుకుని ట్రోలింగ్ చేస్తూ ఉంటారని, అలాంటివారిని బ్లాక్ చేసి పడేయాలని అంటోంది.
ట్రోలింగ్ చేసేవాళ్లు ను విమర్శకులను వేరుగానే చూస్తోంది ఈ బాలీవుడ్ బ్యూటీ, విమర్శలు చేసే వారి నుండి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అని చెబుతోంది.
తమది సినిమా నేపధ్యం ఉన్న కుటుంబం కాబట్టి అందుకే ట్రోలర్స్ తనని టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తుంటారని అంటోంది.
పాపం ట్రోలర్స్ ఎంతలా విజృంభించి ఉండకపోతే ఈ అమ్మడు ఇలా ఫైర్ అయి ఉంటుంది. ఇక కెరియర్ ను చుస్తే ప్రస్తుతం ఈ చిన్న దాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
కంట్రోల్(Control) అనే ఒక సినిమా అలాగే అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ శంకరన్ నాయర్(Un Told Story Of Shankar Nair) అనే సినిమాల్లో నటిస్తోంది. ఈమె నటించిన తాజా చిత్రం కూడా ఈమధ్యనే విడుదలైంది.
ఖో గయే హం కహాన్(Kho Gaya Ham Kaha) అనే సినిమా చేసింది. ఈ సినిమాను అర్జున్ వరైన్ సింగ్9Arjun Varain Sing) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది(Sidhanth Chaturvedi), అర్షర్డ్ గ్రోవర్(Arshad Grovar) కీలక పాత్రలు పోషించారు.