Anasuya Bharadwaj: ఆయన పిలిస్తే నేను రెడీ : అనసూయ

WhatsApp Image 2024 03 28 at 11.02.11 AM Anasuya Bharadwaj: ఆయన పిలిస్తే నేను రెడీ : అనసూయ

బుల్లితెర గ్లామరస్ క్వీన్ అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తనకు ఇంతటి క్రేజ్ , పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన జబర్దస్త్ (Jabardasth) షో నుంచి బయటకు వచ్చిన అనసూయ ప్రస్తుతం సినిమాలు, టెలివిజన్ షోలు, సినియా ఈవెంట్లు చేస్తూ తో బిజీగా ఉంటోంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ అనసూయ తన అభిప్రాయాలను పంచుకుంటూ ట్రోలింగ్ కు గురవుతుంటుంది.

తాజాగా ఇప్పుడు ఈ అమ్మడు రాజకీయాలపైన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు పాలిటిక్స్ అంటే ఇష్టం లేదని ఎప్పుడో చెప్పిన అనసూయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పిలిస్తే ప్రచారానికి రెడీ అని అంటోంది.. లేటెస్టుగా చేసిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ పాలిటిక్స్ పైన తన అభిప్రాయాన్ని తెలపడంతో పాటు జబర్దస్త్‌ నుంచి ఎందుకు బయటకు వచ్చిందో చెప్పుకొచ్చింది.

నా మద్దతు ఆయనకే :

అనసూయ (Anasuya Bharadwaj) ఎంట్రీ తర్వాత బుల్లితెర రూపురేఖలు మారిపోయాయి. బుల్లితెరపై గ్లామర్ షో పెరిగిపోయింది. జబర్దస్త్ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ అంచెలంచెలుగా ఎదుగుదూ సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసింది. తన నటనతో, గ్లామర్ షోతో మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తనకు రాజకీయాలపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని అనసూయ ఇదివరకే తెలిపింది. అయితే తాజా ఇంటర్వ్యూలో ఏ పార్టీ ముఖ్యం కాదని, నాయకులు ముఖ్యమని తెలిపింది.

ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ..”పార్టీ ఏదైనా సరే.. ఆ పార్టీ లీడర్లు నిర్దేశించిన అజెండా నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి నేను మద్దతిస్తాను. మాట వినేవాళ్లు ఉండడం నా అదృష్టం. చెబితే వింటారు కదా అని స్టేజ్‌ మీద ఏదిపడితే అది మాట్లాడకూడదు. ఏదైనా బాధ్యతగా చేయాలి. జనసేన (Janasena)పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పిలిస్తే కచ్చితంగా నేను ఆ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు రెడీగా ఉంటా”. అని అనసూయ కామెంట్ చేసింది ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

జబర్దస్త్ గురించి మాట్లాడుతూ…” వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. డేట్స్ కుదరం లేదు. అందుకే జబర్దస్త్‌ మానేశాను. ఇప్పటికీ ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా సెట్స్‌కు వెళ్తాను”.సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు (Kotasrinivas Rao)గారు చాలా పెద్దవారు. సినిమాల్లో నెగెటివ్‌ పాత్రల్లో ఆయన మెప్పించినట్లు ఎవరూ చేయలేరు.

ఆయన నన్ను ఇంట్లో మనిషిలా భావించారు. అందులోనూ కొంచెం పాతకాలం వ్యక్తి కాబట్టి నా డ్రెస్సింగ్‌ స్టైల్‌ ఆయనకు నచ్చలేదు. నాతో ఉన్న ఫ్రీ నెస్ తో పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం నచ్చలేదని చెప్పారు. దానిని అవకాశంగా తీసుకుని కొంతమంది రకరకాలుగా వార్తలు రాశారు” అని అనసూయ క్లారిటీ ఇచ్చింది.

Leave a Comment