Anchor Suma: నా గుండె ముక్కలైంది

website 6tvnews template 2024 03 18T175346.897 4 Anchor Suma: నా గుండె ముక్కలైంది

1947లో భారత‌దేశానికి స్వాతంత్య్రం లభించినా హైదరాబాద్ సంస్థానం మాత్రం ఇండియన్ యూనియన్‌లో మెర్జ్ కాలేదు. దీంతో సంస్థానంలో ప్రజలపై నిజాం సైన్యం లోని రజాకార్లు దాడులు చేశారు. తమ సైనిక చర్యలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. మహిళల మాన, ప్రాణాలను సైతం బలి తీసుకున్నారు. రజాకార్లు. రైతుల నుంచి శిస్తు వసూలు చేసి వారిని హింసించేవారు.

వాటన్నింటికీ చరమగీతం పాడేందుకు ప్రజల నుంచి ఉద్భవించిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. ఈ పోరాటన్ని కథగా ఎంచుకుని ప్రజల తిరుగుబాటు, ఉద్యమ అంశాలతో దర్శకుడు యాట నారాయణ (Yata Narayana)ఇటీవల ‘రజాకార్’(Razakar)అనే సినిమా తీశారు. ఈ మూవీ శనివారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా చూసిన వారు తమదైన రివ్యూలను అందిస్తున్నారు. తాజాగా బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల (suma Kanakala)రజాకార్ సినిమాపై రివ్యూ ఇచ్చింది.

రజాకార్ (Razakar)సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడుతోంది. నిజాం పాలనలో భాగ్యనగరంలో జరిగా దారుణాలను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించిందని సినిమా చూసినవారంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. ఒక్క మాటలో ఈ సినిమా చూసి గుండె బరువెక్కిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. మొదట్లో మూవీపై విమర్శలు చేసిని వారు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. సినిమా చాలా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.. కలెక్షన్స్ పరంగానూ మంచి వసూళ్లనే రజాకార్ రాబడుతోంది.

ఈ సినిమాను తాజాగా బుల్లితెర యాంకర్ సుమ (Suma Kanakala)చూసేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటూ ఈ సినిమా పై సుమ ఇంట్రెస్టింగ్ రివ్యూను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. సుమ బుల్లితెరమీద తన యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించడమే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లను ఆర్గనైజ్ చేయడమే కాదు ఆ సినిమాలను చూసి రివ్యూ కూడా ఇస్తుంటుంది.

అదే విధగా ఆమె రజాకార్ సినిమాకు తాజాగా రివ్యూ ఇచ్చింది. ఈ సినిమాను చూసి నా గుండె ముక్కలైందని ఓ ఎమోషనల్ పోస్ట్ పంచుకుంది. ” హైద్రాబాద్ సంస్థాన స్వతంత్ర ఉద్యమాన్ని డైరెక్టర్ చక్కగా చూపించారు. ఇలాంటి సినిమాను తీసిన మేకర్స్ కు నా హ్యాట్సాఫ్.. ఈ మూవీలో ప్రతి ఒక్కరు ఎంతో బాగా నటించారు.. ఇలాంటి సినిమాలు తియ్యాలంటే బడ్జెట్ తో పాటు ధైర్యం కూడా కావాలి. నిజంగా సినిమా చాలా బాగుంది”.అని తన అభిప్రాయాన్ని తెలిపింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Comment