Anchor Suma Guinness record has gone viral : గిన్నిస్ రికార్డు పై సుమ పెట్టిన పోస్ట్ వైరల్. సుమ తాతయ్య ఎం చేస్తారో తెలుసా.
మైకు దొరికితే చాలు గల గలా మాట్లాడుతూ, ప్రోగ్రాం మొదలు పెట్టేస్తుంది సుమ, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు సుమ యాంకరింగ్ చేసే కార్యక్రమాలు చూస్తుంటారు. కేవలం టివిలో యాంకరింగ్ మాత్రమే కాదు. సినిమా ఫంక్షన్లు, విజయోత్సవాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్ లు ఇలా ఒకటేమిటి, ఎన్నో పనులతో బిజీ బిజీగా గడిపేస్తుంది సుమ, ఇవి చాలవన్నట్టు సినిమా తారలను అప్పడుడప్పుడు ఇంటర్వ్యూలు కూడా చేస్తుంటుంది.
ఇన్ని చేస్తుంది కదా అలిసిపోయి ఉంటుంది అనుకుంటారేమో, కానీ కాదు. ఖాళి దొరకపుచ్చుకుని మారీ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తన సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఇలా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సుమ ఒక ఆశక్తికర విషయాన్నీ పంచుకుంది. తన తల్లికి మేనమామ అయ్యే వ్యక్తి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయన సుమకి వరుసకు తాతయ్య అవుతాడట. అతని గురించి అంత ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అనుకంటున్నారా ? అయన గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు.
98 సంవత్సరాల వయసున్న పీ బాలసుబ్రహ్మణ్యం మీనన్ అత్యంత ఎక్కువ కాలం పాటు అంటే 73 సంవత్సరాల 60 రోజులుగా కొనసాగుతున్నారంట. ఇప్పటికి ఆఫీసుకు వెళుతూ, కేసులు టేకప్ చేస్తూ.. కోర్టుకి వెళుతుంటారట. తన తాతయ్య తన హీరో అని చెబుతూ తెగ సంబరపడిపోతోంది సుమ.
సుమ పోస్ట్ పెడితే నెటిజన్లు స్పందించకుండా ఉంటారా.. భవిష్యత్తులో మీరు ఇలాగే సుదీర్ఘ కాలంపాటు యాంకరింగ్ చేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయాలంటూ రిప్లై ఇస్తున్నారు. సుమ తీరు చుస్తే అలా అవ్వడం లో ఆశ్చర్యం ఏమి లేదని అంటున్నారు.