Anil Kumar Yadav not contesting from Nellore : ఆంధ్ర ప్రదేశ్ మాజీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) నెల్లూరు నుండి పోటీ చేయబోవడం లేదని, అయన అసలు శాసనసభకే పోటీ చేయబోవడం లేదనే వార్తలు వైరల్ గా మారాయి.
తాజా గా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డిని(Ys Jagan Mohan Reddy) తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.
ఈ భేటీలో అనిల్ తోపాటు ప్రముఖ వ్యాపారవేత్త చలమలశెట్టి సునీల్ కూడా ఉన్నారు. ఈ భేటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే mla అనిల్ కుమార్ యాదవ్ ను ఈ దఫా ఎన్నికల్లో లోక్ సభ కు పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయ్యారట.
పైగా నెల్లూరు జిల్లాకి చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను నెల్లూరు లోక్ సభ స్థానం నుండి కాకుండా నరసరావుపేట లోక్ సభ స్థానం నుండి పోటీ చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
నరసారావు పేట లోక్ సభ స్తానం నుండి పోటీ ? Will he Contest from NarasaRao Peta Lok Sabha seat?
ఇప్పటికే సీఎం జగన్ నరసారావుపేట నుండి బిసి సామజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలని డిసైడ్ అవ్వడం, అందుకు అనుగుణంగా నరసరావుపేట ఎంపీ గా ఉన్న లావు శ్రీకృష్ణ దేవరాయులును(Lavu Srikrishna Devarayulu) గుంటూరు లోక్ సభ స్థానం(Guntur Loksabha) నుండి పోటీ చేయమని కోరడం జరిగాయి.
అయితే లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేట స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని తేల్చేశారు. అవసరమైతే పార్టీ అయినా మారతాను తప్ప స్థానాన్ని మాత్రం మారానని ఖరాఖండీగా చెప్పారు.
ఈ విషయంలో అటు అధినేత జగన్ ఇటు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఇద్దరు తెగేదాకా లాగేశారు. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ పార్టీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రెండిటికి రాజీనామా చేశారు.
స్థానికేతరుడైనప్పటికీ.. Even if a non-native
ప్రస్తుతం ఖాళీగా ఉన్న నరసరావుపేట లోక్ సభ స్థానంలో ఎవరిని నిలబెట్టాలా అని చూస్తున్న తరుణంలో పార్టీకి అనిల్ కుమార్ యాదవ్ కనిపించారు.
అనిల్ కుమార్ యాదవ్ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడని అందరికి తెలిసిందే. పైగా యాదవ సామజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పని చేసిన సమయంలో తన వాగ్ధాటితో రాష్ట్రం లో అందరి నోళ్ళల్లోనూ నానారు.
అందుకే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకి(Nellore District) చెందిన వ్యక్తి అయినప్పటికీ స్థానికేతరుడు అనే మాట రాకపోవచ్చని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.