Triptii Dimri: యానిమల్ బ్యూటీ కెవ్వు కేక..చీరకట్టు ఫోటోలు వైరల్.

Animal beauty Kevvu Keka..Sarikattu photos are viral.

Triptii Dimri: యానిమల్ బ్యూటీ కెవ్వు కేక..చీరకట్టు ఫోటోలు వైరల్.

తృప్తి దిమ్రీ ఈ పేరుకు ఇంట్రడక్షన్ అవసరం లేదు. సోషల్ మీడియాలో ట్రెండింగ్‎లో ఉన్న బ్యూటీ ఈ భామ. యానిమల్ సినిమాలో రెండో హీరోయిన్‌గా రణబీర్ కపూర్‎తో చేసిన సీన్స్ తో అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

తన హాట్ హాట్ అందాల ఆరబోతతో పాటు క్యూట్ యాక్టింగ్‎తో వావ్ అనిపించింది ఈ చిన్నది. ఉత్తరాఖండ్‎కు చెందిన ఈ బ్యూటీ ఇండియా మొత్తాన్ని ఓ ఊపు ఊపేస్తోంది.

తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. అది అలా ఉంటే తాజాగా ఈ భామ కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన మూవీ యానిమల్. ఈ మూవీలో హీరోగా రణబీర్ కపూర్ నటించాడు. బాలీవుడ్ లవర్ బాయ్ అయిన రణబీర్ యానిమల్ సినిమాలో మాత్రం యాంగ్రీ యంగ్ మెన్‎గా అదరగొట్టాడు.

మాస్ లుక్‎తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ మూవీలో రష్మిక మందనతో పాటు రెండో హీరోయిన్ గా తృప్తి దిమ్రీ కనిపించింది. రష్మిక రణబీర్ భార్య కాగా, తృప్తి దిబ్రీ జోయా రియాజ్ క్యారెక్టర్ లో కనిపించింది.

ఈ పాత్రలో తృప్తి రెచ్చిపోయిమరీ యాక్ట్ చేసింది. దీంతో తృప్తి పేరు బాలీవుడ్ , టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వినిపిస్తోంది. అమ్మడి హాట్ అందాలకు అందరూ ఫిదా అయిపోయారు. అందుకే తెలుగులో ఈ భామకు వరుస అవకాశాలు ఆమె తలుపు తడుతున్నాయి.

తృప్తి బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. చాలా వరకు అవి హిట్ సినిమాలే. అందంతో మెస్మరైజ్ చేయడమే కాదు తృప్తిలో మంచి నటి కూడా ఉంది.

గతంలో ఈ బ్యూటీ బుల్ బుల్, మామ్, వంటి సినిమాల్లో నటించి తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక యానిమల్ లో అమ్మడి యాక్టింగ్ కు ఫిదా అయిన ఫిల్మ్ మేకర్స్ ఈ భామ కావాలంటూ ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ చిన్నది టాలీవుడ్ మహారాజ రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యనే టైగర్ నాగేశ్వరరావుతో తెరముందు సందడి చేద్దామని అనుకున్నా ఈ మూవీ ఆ రేంజ్‌లో హిట్ కొట్టలేకపోయింది.

ఆయనా కూడా కార్తీక్ ఘట్టమననేని డైరెక్షన్ లో “ఈగల్” మూవీ చేస్తున్నారు రవితేజ. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారని సమాచారం.

ఈ చిత్రంలో తృప్తి దిమ్రీ సెకండ్ హీరోయిన్‌గా నటించినుందని టాక్. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తెలుగు సినిమాలు వరుసగా క్యూ కడుతున్న నేపథ్యంలో ఎవరితో యాక్ట్ చేయాలని కోరికగా ఉందని తృప్తిని అడగ్గా..యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

నాకు జూనియర్ ఎన్టీఆర్‌తో యాక్ట్ చేయాలని ఉందని తన మనసులోని మాట చెప్పేసింది. తృప్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో విడుదలకానుంది.

తృప్తి దిమ్రీ వ్యక్తిగత విషయానికి వస్తే…ఈ బ్యూటీ ఉత్తరాఖండ్ లో పుట్టింది. ముందు మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది.

అనంతరం 2017లో కామెడీ మూవీ పోస్టర్ బాయ్స్ తో మొదటిసారి తెరముందు కనిపించింది. ఆ తర్వాత రొమాంటిక్ డ్రామా లైలా మజ్నులో నటించింది.

అనంతరం అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ లో నటించింది. ఈ మూవీతో అమ్మడికి మంచి గుర్తింపు లభించింది.

Leave a Comment