Animal beauty Rashmika : యానిమల్ బ్యూటీ వింటర్ లుక్స్ అద్భుతం.

Animal beauty winter looks are amazing.

యానిమల్ బ్యూటీ అరాచకం..వింటర్ లుక్స్ అద్భుతం.

నేషనల్ క్రష్ శాండిల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్న జోరు మామూలుగా లేదు. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్‎లో వరుస హిట్ సినిమాలతో దుమ్ముదులుపుతోంది ఈ చిన్నది.

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పాతో అమ్మడి ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. టాలీవుడ్‎లో స్టార్డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‎లోనూ మంచి క్రేజ్‎ను సంపాదించుకుంటోంది.

ఇటీవల విడుదలైన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తోంది. ఈ మూవీ బాలీవుడ్‎లో అమ్మడికి మరింత క్రేజ్ తీసుకువచ్చింది.

ఇదే ఊపుతో ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ అనే తేడా చూడకుండా చిత్ర పరిశ్రమలన్నింటిలో తన సత్తా చూపించే పనిలో నిమగ్నమైంది ముద్దుగుమ్మ.

అతికొద్ది సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా మారిన ఈ కన్నడ అందం వరుస సినిమా షూటింగ్లతో బిజీగా మారిపోయింది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాను మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయదు.

వీలు కుదిరినప్పుడల్లా రష్మిక తన ఫాలోవర్స్‎కు తన అందాలతో ట్రీట్ ఇస్తుంటుంది. యానిమల్ సినిమా ప్రమోషన్లలో భాగంగా రష్మిక అద్భుతమైన ఫోటో షూట్ చేసింది. ఆ పిక్స్‎ను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసింది. ఈ అవుట్ ఫిట్‎లో బ్యూటీఫుల్ లుక్స్‎తో ఆకట్టుకుంటోంది రష్మిక.

సీజనల్ డ్రెస్‎లో మంత్రముగ్ధులను చేసింది. శీతాకాలం వేళ యాష్ కలర్ గౌనులో రష్మిక మందన్న మైండ్ బ్లోయింగ్ లుక్‎ను సొంతం చేసుకుంది.

తన అందంతో కుర్రాళ్ల హృదయాలను దోచేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.అమ్మడి అందాలను చూసి నెటిజన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఛలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక. ఆ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి గీత గోవిందం సినిమాలో తళుక్కుమంది. ఈ మూవీ హిట్ కావడంతో రష్మిక తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

Add a heading 2023 12 04T134358.000 Animal beauty Rashmika : యానిమల్ బ్యూటీ వింటర్ లుక్స్ అద్భుతం.

ఆ తర్వాత విజయ్‌తో మరోసారి డియర్ కామ్రెడ్ మూవీ చేసింది. ఈ మూవీ కూడా రష్మికకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవ్వరులో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ కన్నడ బ్యూటీ.

ఆ తర్వాత పుష్ప సినిమాతో అమ్మడి స్టారే మారిపోయింది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ చూపించిన ఈ మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో ఇరగదీసింది.

అన్ని వర్గాల ప్రేక్షకులను పుష్ప అలరించింది. దీంతో రష్మిక నేషనల్ క్రష్‎గా మారిపోయింది. తన నటనతో పాటు చిలిపితనంతో తన ఫ్యాన్స్‎ను ఎంతగానో ఆకర్షిస్తుంది రష్మిక.

అందుకే ఈ బ్యూటీకి ఫాలోయింగ్ ఓ రేంజ్‎లో ఉంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నితిన్‌, వెంకీ కుడుముల సినిమాతో పాటు..అల్లు అర్జున్ ‌తో పుష్ప 2 సినిమా చేస్తోంది.

కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌ రష్మిక మందన్న సొంతూరు. కూర్గ్ పబ్లిక్ స్కూల్లో రష్మిక స్కూలింగ్ చేసింది. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్‎లో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.

రష్మిక బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 లిస్టులో స్థానం సంపాదించి అదరగొట్టింది. ఇక రష్మిక పేరెంట్స్ బిజినెస్ చేస్తుంటారు. ఈ బ్యూటీకి ఓ సిస్టర్ కూడా ఉంది.

Leave a Comment