Animal Box Office Prediction : యానిమల్ బాక్స్ ఆఫీస్ ప్రెడిక్షన్ ఏంటంటే..
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఈ సినిమాలో రన్బీర్ కపూర్, రష్మిక మందన్న జోడీగా నటిస్తున్నారు.
అనీల్ కపూర్, బాబీ డియోల్,తృప్తి డిమ్రి ప్రధాన పాత్రదారులుగా నటిస్తున్నారు. 2023 డిసెంబర్ 1న విడుదల అవనున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉన్నారు.
CBFC యానిమల్ కు 3 గంటల 21 నిముషాల రన్ టైమ్ తో ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంత లెన్తీ సినిమాని రణబీర్, రష్మిక ఇద్దరు సమర్దించారు.
సందీప్ రెడ్డి వంగ ఒక రైటర్ గా, దర్శకుడిగా, ఎడిటర్ గా మనందరికీ పరిచయమే. విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఇతని మొదటి చిత్రం. ఈ సినిమా పెద్ద కమర్షియాల్ హిట్ గా అతని కెరియర్ లో గుర్తుండిపోయే సినిమా.
ఆ తర్వాత 2019 లో ఇదే అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు. ఈ సినిమా విజయం తరువాత సందీప్ రెడ్డి వంగా నుంచి వచ్చే మరో సినిమానే ఈ యనిమాల్.
తాజాగా నవంబర్ 23న ఎంతో ఘనంగా విడుదలైన యానిమాల్ ట్రైలర్ చూసిన సినీ అభిమానులు సినిమా ఎపుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.
32 సెకండ్ల ఈ ట్రైలర్ ప్రేక్షకులని ఉర్రూతలుగిస్తోంది. ఈ ట్రైలర్ లో రన్బీర్, అనీల్ కపూర్ ల మధ్య ఓ సన్నివేశంతో మొదలవుతుంది.
తండ్రి కొడుకులుగా అసలు రన్బీర్, అనిల్ కపూర్ ల మధ్య ఉన్న సంబంధం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని పెంచుతుంది.
అంతే కాకుండా దీనిలో రన్బీర్ పాత్ర ఒకింత క్రూరంగా ఉండటంతో ఇది ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రన్బీర్ నటన గురిచి ప్రముఖ నిర్మాత రాజ్ కుమార్ హిరాని మాట్లాడుతూ, రన్బీర్ కపూర్ కెరీర్ లోనే ఇది అత్యుత్తమ నటనగా మిగిలిపోతుందని అన్నారు.
ఇక హీరోయిన్ రష్మిక మందన్న,2016 లో కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో గీతాగోవిందం, సరిలేరునీకెవ్వరు, భీష్మ, పుష్ప లాంటి చిత్రాలలో మరియు మరిన్ని తెలుగు చిత్రాలలో నటించింది.
తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో నటిస్తుంది. ఇప్పటికే రష్మిక 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకుంది.
అయితే ఈ మధ్యలో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. AIని ఉపయోగించి రష్మికని పోలి ఉండేలా ఒక మహిళ వీడియోని పెట్టారు.
ఈ డీప్ ఫేక్ వీడియో గురించి రష్మిక స్పందించడం, ఇంకా చాలా మంది సినీప్రముఖులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ విషయం చాలా పెద్దగా మారింది, డీప్ ఫేక్ వీడియో గురించి పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగినది.
ఇలా యానిమల్ సినిమా హీరోయిన్ తో మొదలైన వివాదాలు ఇంకా ట్రైలర్ తరువాత విజృంభించాయి.
పుష్పలో ఆమె నటన చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా యానిమల్ కోసం కలిశారు.
యానిమల్ లో గీతాంజలి అనే పాత్రలో చేస్తున్నారు.
ట్రైలర్ లో సరిగ్గా అర్ధం కానీ డైలాగులతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయబడుతుంది, వీటికి రష్మిక మందన్న ట్విటర్ లో స్పందించింది, ” అంతమొరటుగా ప్రవర్తించవద్దు, చిత్రం అలా చికాకు కలిగించదు” అని చివరికి ఈ చిత్రం ఈ చికాకులు నుండి బయటపడి ప్రేక్షకుల మనసు కొల్లగొడుతుందా లేదా చూడాలి మరి.
ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమా చాలా కాంట్రవర్సీలకు గురైంది.
ట్రైలర్ లో గృహహింసని ప్రోత్సాహిస్తున్నారని, పురషాధిక్యతను సమర్థిస్తున్నారని, ఇలాంటి ఆరోపణలతో ఈ చిత్రం మరింత సంచలనాత్మకంగా మారింది.
ఇది మాత్రమే కాదు, సినిమాలో లీక్ అయిన కొన్ని చిత్రాలలో స్వస్తిక్ గుర్తుగల కొన్ని చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.
సందీప్ వంగ జర్మన్ లోని నాజీ పార్టీ చిహ్నంగా ఉపయోగించే స్వస్తిక్ చిహ్నానికి సినిమాలో ఇద్దరు వ్యక్తులు సెల్యూట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
సందీప్ వంగ ఒక వర్గపు ప్రేక్షకులని రెచ్చగొట్టి, నాజీయిజాన్ని ప్రోత్సాహిస్తున్నాడని కొంతమంది ఆరోపిస్తునారు.
ఏదేమైనప్పటికి యానిమల్ సినిమా గురించి సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డిసెంబర్ 1 కోసం ఇప్పుడే కౌంట్ డౌన్ వేసుకున్నారు.
ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ కూడా చేస్కుంటున్నారు. ఈ లెక్కన సినిమా హిట్టయినా ఫట్టయినా బాక్స్ ఆఫీసులో కలెక్షన్ల పండగ తప్పకుండ జరిగేలాగే ఉంది.
ఈ చిత్రంలోని పాటలు, మాటలు, ట్రైలర్ లోని సన్నివేశాలు ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకున్నాయి.
ఇక విశ్లేషకుల అంచనా చూస్తే, యనిమాల్ మొదటిరోజే బాక్స్ ఆఫీసు కలెక్షన్ లో మోత మొగిపోద్దని అంటున్నారు.
మొదటి రోజు దాదాపు 50 కోట్ల భారీ కలెక్షన్లు రాబోతున్నాయని సినీపరిశ్రమలో గుసగుసలు మొదలయ్యాయి.
ఎన్ని మాటలు వినిపించినా, ఎన్ని అంచనాలు ఉన్నా సినిమాని గెలిపించేది ప్రేక్షకులే కాబట్టి, ఈ యానిమల్ ని గెలిపిస్తారో, ఓడిస్తారో డిసెంబర్ 1 న చూడాలి మరి.