Animal Movie collections : థియేటర్ లలో యానిమల్ గర్జన..ఒక్కరోజులోనే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతో తెలుసా?

Animal Movie collections

థియేటర్ లలో యానిమల్ గర్జన..ఒక్కరోజులోనే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతో తెలుసా ?


సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో శుక్రవారం అంటే డిసెంబర్ 1వ తేదీన యానిమల్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా విడుదల అవుతూనే సామ్ బహదూర్ సినిమాతో గట్టి పోటీ పడింది.

విడుదలైన మొదటిరోజునే 63.80 కోట్ల కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ లో సంచలనం సృష్టించింది.
బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్, ” ఒక్క రోజులో యానిమల్ సినిమా 63. 80 కోట్ల వసూళ్లు రాబట్టింది.

సెలవు కాదు ఆలా అని పండగా కాదు, పెద్దవాళ్లు చూడవచ్చని సిర్టిఫై ఐన చిత్రం, పెద్ద పెద్ద తారాగణం అతిధి పాత్రలలో ఎక్కువగా ఉన్న సినిమా కూడా కాదు,

సినిమా సమయం కూడా చాల ఎక్కువ 3 గంటలు… , ఇదంతా పక్కన పెట్టిన మరో సినిమాతో పోటీ.. ఇన్ని ఉన్నప్పటికీ యానిమల్ సినిమా దేశవ్యాప్తంగా చాలా మంచి ఆదరణ పొందింది. రణబీర్ కపూర్ చేసిన చిత్రాలలో ఇది పెద్ద ఓపెనర్” అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.

యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ నటనకి ప్రేక్షకుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది.
అనిల్ కపూర్ కి కొడుకు పాత్రలో నటిస్తాడు రణబీర్ కపూర్. ఇద్దరు తండ్రి కొడుకులుగా అద్భుతంగా నటించారు.

ఒక హింసాత్మక వ్యక్తిగా, తండ్రికి తగ్గ కొడుకుగా నటించాడు రణబీర్.ఈ సినిమా పేరుతో పాటు జనవరి 2021లో సినిమా గురించి అధికారిక ప్రకటన చేసారు.

డిసెంబర్1 న విడుదలైన యానిమల్ సినిమా విమర్శకుల నుంచి కూడా సగటు సమీక్షలనందుకుంది.
రణబీర్ సింగ్, రష్మిక మందన్న, అనిల్ కపూర్, త్రిప్తి డీమ్రి, పృద్వి రాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Add a heading 2023 12 02T135824.266 Animal Movie collections : థియేటర్ లలో యానిమల్ గర్జన..ఒక్కరోజులోనే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంతో తెలుసా?

ఈ సినిమాని ముందుగా ఆగస్టు 11నే విడుదల చేయాలనీ చిత్రబృందం నిర్ణయించుకుంది కానీ, పోస్ట్ ప్రొడక్షన్ మరియు డబ్బింగ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వాళ్ళ విడుదల తేదీ వాయిదా పడింది.

డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దేశవ్యాప్తంగా విడుదల అయింది.
సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి A సర్టిఫికెట్ పొందిన యానిమల్ చిత్రం, రక్తపాతం, హింస , అసభ్యత ఇలా చాలా అంశాలు కలిగి ఉంది.

ఇక ప్రేక్షకుల విషయానికి వస్తే, దీన్ని ఒక మాస్టర్ పీస్ గా వర్ణిస్తున్నారు. రణబీర్ కపూర్ తమ అంచనాలకు మించిపోయాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మొదటి 25 నిముషాలు రణబీర్ నటనకి అసలు ఆ సినిమాలోనే నిమగ్నమయ్యానంటూ మరో అభిమాని ట్వీట్ ద్వారా అందరితో పంచుకుంది.

మొదటి రోజే 63. 80 కోట్ల కలెక్టన్లతో హిట్ జాబితాలోకి అడుగు పెట్టినట్టే. 100 కోట్లు పెట్టి తీసిన సినిమా 2 రోజుల్లో పెట్టుబడిని మించిపోతుంది.

2023కి మంచి హిట్టు టాక్ తో ముగిపునిచ్చి కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతోంది చిత్ర బృందం.యానిమల్ సినిమా విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్ తో 22.41 కోట్లు వసూలు చేసింది.

థియేటర్లో సినిమా అడుగు పెట్టకముందే 8లక్షల టిక్కెట్లు అమ్ముడు అయ్యాయి.
ఢిల్లీలోని NCR ప్రాంతంలో 1318 షోలు ప్రదర్శించబడ్డాయి., 79శాతం థియేటర్లలో ఈ సినిమానే ఆడింది.
ముంబైలో 1040 షోలు ప్రదర్శించబడ్డాయి.

ఆక్యుపెన్సీ రేటు 55 శాతాన్ని మించింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 316 షోలు ఆడాయి. ఆక్యుపెన్సీ అయితే 82 శాతానికి పైగా ఉంది.చెన్నైలో 88 షోలు వేయగా అక్కడ కేవలం 30 శతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది

Leave a Comment