Annaram Barrage : అన్నారం బ్యారేజీ లో లీకేజి సీక్రెట్స్ ఇవే.
కాళేశ్వరం లోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కుంగిన విషయం మరువకముందే మరో ప్రాజెక్టు లో నీటి లీకేజి తెలంగాణ ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం బ్యారేజీ దిగువన, ఎండ్‌సీల్ ప్రాంతంలో పలు చోట్ల నీటి బుంగలు ఏర్పడ్డాయి.
బ్యారేజి లోని 4వ బ్లాకులో 38, 42 వ పిల్లర్ల వెంట్ ప్రదేశాలలో రెండు రోజుల క్రితం ఈ లీకేజీలు మొదలయ్యాయి. ప్రస్తుతం నాటు పడవల ద్వారా బుంగలు ఏర్పడిన ప్రాంతాలకు చేరుకొని ఇసుక సంచులు, రాళ్లతో అడ్డుకట్ట వేస్తున్నారు. అయినప్పటికి అక్కడ పరిస్థితి అదుపులోకి రాలేదనే చెప్పాలి.
డిజైన్లలో అనుభవం ఉన్న ఇంజినీర్ల మాటలు ఎలా ఉన్నాయంటే.. ఈ పైపింగ్ ప్రారంభ దశలోనే గుర్తించాలన్నారు, లేదంటే దిగువన ఇసుక క్రమంగా కోతకుగురై వెళ్ళిపోతుంది. మేడిగడ్డ ప్రాజెక్టు లో ఇలాగే జరిగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. అయితే అన్నారంలో ముందుగానే గమనించి చర్యలు చేపట్టారు కాబట్టి అంతటి ప్రమాదం ఉండకపోవచ్చంటున్నారు.
గడిచిన నాలుగు రోజుల నుండి బ్యారేజీలో నీటి నిల్వను క్రమక్రమంగా తగ్గించడం చేశారు అధికారులు. దీనిపై కేంద్ర జల సంఘం తెలంగాణ డ్యాం సేఫ్టీ అధికారులకు ఒక సూచన చేసింది. అన్నారం, సుందిళ్ల కూడా మేడిగడ్డ బ్యారేజీలాంటి డిజైన్ లే కాబట్టి అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పింది.
లీకవుతున్న నీటితోపాటు ఇసుక కూడా వస్తేనే ప్రమాదం ఉంటుందని, కానీ అన్నారం ప్రాజెక్ట్ లీకేజ్ లో ఇసుక రావడం లేదు కాబట్టి ప్రమాద స్థాయి కూడా తక్కువే అని