Mansoor Ali Khan: మన్సూర్ అలీ ఖాన్ కి మరోసారి చేదు అనుభవం.

Another bitter experience for Mansoor Ali Khan.

Mansoor Ali Khan:మన్సూర్ అలీ ఖాన్ కి మరోసారి చేదు అనుభవం.

త్రిష విషయంలో పిటిషన్ ని తిప్పికొట్టి జరిమానా విధించిన మద్రాసు హైకోర్టుగత కొన్ని రోజులుగా MANSOOR ALIKHAN వార్తల్లో హాట్ టాపిక్ గా మారాడు.

ఇటీవల THRISHA పైన అనుచిత వ్యాఖ్యలు చేసి, సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత సంపాదించుకున్నాడు.

MANSOOR ALIKHAN వ్యాఖ్యలపైTHRISHA స్పందన :

MANSOOR ALIKHAN నా గురించి నీచంగా మరియు అసహ్యంగా మాట్లాడిన మాటలు నా వరకు వచ్చాయి. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. మరియు ఇది అగౌరవం, ద్వేషం,

అసహ్యకరమైన మరియు చెడు అబిరుచితో ఉంది. అతను కోరుకుంటూనే ఉండగలడు కానీ అతని లాంటి వ్యక్తితో నేను స్క్రీన్ పంచుకొకపోయినందుకు నేను సంతోషిస్తున్నా,

మరియు నా మిగిలిన సినిమా జీవితంలో కూడా అలా జరగకుండా చూసుకుంటాను. ఆయనలాంటి వారి వల్ల మానవాళికి చెడ్డ పేరు వస్తుంద”ని అన్నారు.

ఇలాంటి సంఘటన జరిగినప్పటికి MANSOOR ALIKHAN, THRISHA కి క్షమాపణ చెప్పలేదు.
ఈ విషయం మహిళా సంఘాలు, పోలీసులు అందరు ఇన్వొల్వ్ అయ్యాక విషయం పెద్దదవుతుందని గ్రహించి, అపుడు క్షమపణగా మరో ట్వీట్ రాశాడు.

MANSOOR ALIKHAN క్షమాపణ:

” నా తోటి నటిTHRISHA నన్ను క్షమించండి. మీ వివాహంలో మంగళసూత్రం తెచ్చి ఆశిర్వదించే అవకాశం రావలనుకుంటున్నా”నని వెల్లడించాడు.

ఈ గోడవలో THRISHA కి మద్దతుగా CHIRANJEEVI, KUSHBHU MANSOOR ALI KHAN ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు, ఇక అది పట్టుకున్న MANSOOR ALIKHAN, THRISHA, CHIRANJEEVI, KUSHBU లపై పరువు నష్టం దావా వేశాడు.

కోర్టు నుంచి కూడా వ్యతిరేకత:

మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ సతీష్ కుమార్ MANSOOR ALIKHAN వేసిన పిటిషన్ ని కొట్టివేసి, ఇదంతా పబ్లిసిటీ కోసం ఆడుతున్న డ్రామా అని, విలువైన కోర్టు సమయాన్ని వృదా చేసినందుకు, MANSOOR ALIKHAN లక్ష రూపాయలు చెన్నైలోని అడయార్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ కి జరిమానగా చెల్లించాలని ఆదేశించింది.

Leave a Comment