హైదరాబాద్ లో నివసించే వారికి తమ పనుల మీద కాని లేదా ఆఫీస్ వెళ్లేవారికి కాని లేదా వ్యాపార నిమిత్తం నగరం తిరగాలంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అను నిత్యం వెంటాడుతూ ఉంటుంది. ఇప్పటికే మనకి మాదాపూర్ దగ్గర ఇనార్బిట్ మాల్ సమీపం లో ఒక కేబుల్ బ్రిడ్జి ఉంది. అదే మనకి మొదటి కేబుల్ బ్రిడ్జి.
ఈ కేబుల్ వల్ల జూబ్లి హిల్స్ ప్రాంతాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కలుపుతూ ఉండడం వల్ల ఆ ప్రాంతం వారికి ఇది చాల ఉపయోగం ఉంది. అలాగే తాఫిక్ కష్టాలు తీరడానికి ఇంకో బ్రిడ్జి కట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. అది ఎక్కడ అంటే మీర్ ఆలం ట్యాంక్ మీద కట్టడానికి ప్లాన్ రెడీ అయ్యింది. ఇది నగరానికి రెండవ బ్రిడ్జి అవుతుంది. దీని ప్లాన్ ప్రకారం చింతల్ మేట్ రోడ్డు ను బెంగళూరు నేషనల్ హైవెని కలుపుతూ మీర్ ఆలం చెరువు మీదుగా హైదరాబాద్ కు ఈ కేబుల్ బ్రిడ్జి రానుంది.
దీనికి దాదాపు 363 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అంతే కాకుండా 4 లేన్ల హైలెవిల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం అవసరమైన పరిపాలన అనుమతులు అన్ని మంజూరు చేసింది. ఈ 4 లేన్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేసిన ముఖ్యంత్రి కి MIM నేత అసదుద్దీన్ ఒవైసీ తాంక్స్ చెప్తూ X లో ట్వీట్ చేసారు. ఈ మీర్ ఆలం చెరువు పై నిర్మించే బ్రిడ్జి పొడవు 2.65 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన స్ధలం కూడా సేకరించడం కూడా మొదలు పెట్టడం జరిగింది.
ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఓల్డ్ సిటీ వైపు వచ్చే వాహనాల రద్దీ తగ్గి ట్రాఫిక్ సమస్యల కష్టాలు తగ్గుతాయని అధికారులు చెప్పారు. మూసి నదికి దక్షిణం వైపు ఉన్న మీర్ ఆలం చెరువుకు ఒకప్పుడు హైదరాబాద్ సస్దానం మాజీ ప్రధాని అయిన మీర్ ఆలం బహదూర్ ఉండే వారు, ఈయన పేరునే ఈ ప్రదేశం లో ఉన్న చెరువు కి పెట్టడం జరిగింది. దీని ద్వారా ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రాక ముందు హైదరాబాద్ నగర ప్రజలకు ఈ చెరువు నీరే ప్రధాన తాగునీటి వనరు గా ఉండేది