EAGLE Movie: ఈగల్ నుంచి మరో లిరికల్ వీడియో సాంగ్.
మాస్ మహారాజ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రానున్న సినిమా ఈగల్.ఈ సినిమాలో కావ్య థాపర్ మరియు అనుపమా పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఇటీవల విడుదలైన ట్రైలర్ కి వినూత్నమైన స్పందన వస్తుంది.
ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా వెంట వెంటనే వస్తుండడంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇప్పటకే ఈ సినిమాకి సంబందించిన ఒక లిరికల్ సాంగ్ విడుదల అయింది.
ఆ సాంగ్ ఇపుడు ట్రెండింగ్ లో ఉంది.బుధవారం రోజున ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ వీడియొ సాంగ్ ని విడుదల చేసింది.
గల్లంతే గల్లంతే సాంగ్:
గల్లంతే గల్లంతే.. దిల్లంతా గల్లంతే అయినదే అంటూ మొదలయ్యే ఈ పాట అందరి దిల్స్ గల్లంతు చేస్తుందీ.ఈ మెలోడీ పాటని దావ్ జాంద్ కొంపోసే చేశాడు. కపిల్ కపిలన్ లిన్ పాడారు.
కాపు కాసే మాయ గాడే, మౌనమే గాని మాట లేదే, కనరాడే, పోనే పోనివ్వడే.. విడేవ్వడే అంటూ కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఫారెన్ లొకేషన్ లో కావ్య థాపర్ మరియు రవితేజ పైన ఈ పాట చిత్రీకరించారు.