Muslim communities went to the High Court: ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు (Gyanvapi Mosque)లో హిందువులు తమ దేవతలకు పూజలు చేసుకోవచ్చని వారణాసి కోర్ట్ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. మసీదు లోని నేలమాళిగలో ఉన్న వ్యాస్ కా తెహ్కానా పూజలు చేసుకోవచ్చని కోర్ట్ క్లియర్ గా చెప్పడం తో హిందువులు అక్కడ పూజలు ప్రారంభించారు.
అయితే ఈ మసీదు-మందిరం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మసీదులో పూజలు చేయడాన్ని ముస్లిం మతస్థులు తీవరంగా వ్యతిరేకిస్తున్నారు.హిందూ దేవుళ్లకు మసీదులో పూజలు చేసుకోవచ్చిన ఏదైతే వారణాసి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందో, ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు(Supreme Court) వెళ్లారు.
సుప్రీం కోర్ట్ సూచన : Supreme Court reference
అయితే సుప్రీం కోర్టు లో వారికి చుక్కెదురైంది. ఈ వ్యవహారంలో ముందు హైకోర్టుకు(High court) వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది, దాంతో వారు అలహాబాద్ హైకోర్టును(Allahabad High Court) ఆశ్రయించక తప్పలేదు. ఈ విషయంలో ముస్లింలకు చెందిన అంజుమ్ ఇంతేజామియా కమిటీ అలహాబాద్ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేసాయి.
కానీ ఈ పిటిషన్ పై విచారణ జరపబోయే ముందు తమ వాదనలు కూడా వినాలని హిందూ మతానికి చెందిన వారు కోర్టును కోరారు. ఈమేరకు హిందూ పక్షాలు అలహాబాద్ హైకోర్టులో కేవియట్ ను దాఖలు చేశాయి. ఇక పోతే ఈ మసీదు ఆలయంలో హిందువులు తమకు అనుకూలంగా తీర్పు వచ్చిన నాటి నుండి రోజుకు ఐదు సార్లు హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.