సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జోడీగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ టిల్లు స్వ్కేర్ (Tillu Square)సినిమా బాక్సాపీస్ దగ్గర సాలిడ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. పాజిటివ్ రివ్యూలతో ఊహించిన దాని కంటే ఎక్కువే మ్యాజిక్ చేస్తున్నాడు టిల్లు గాడు. ఫస్ట్ డేనే టిల్లు స్క్వేర్ ప్రపంచవ్యాప్తంగా 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. గ్లోబల్ లెవెల్ లో టిల్లు గాడి హవ గట్టిగానే కనిపిస్తోంది. దీంతో వీకెండ్ పూర్తయ్యే సరికి కలెక్షన్లు మాములుగా ఉండవని అర్థమవుతోంది.
టిల్లు తన యాక్టింగ్ తో చింపేశాడు. ఇక ఈ మూవీలో మరో హైలెట్ అనుపమ పరమేశ్వరన్ . అనుపమ అందాల ఆరబోత గట్టిగానే చేసింది. హీరోతో లిప్‌లాక్‌లు, రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయింది. అయితే సినిమా రిలీజ్ కు ముందు అనుపమను సోషల్ మీడియాలో గట్టి ట్రోల్ చేశారు. లిల్లీ క్యారెక్టర్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా కమెంట్ చేశారు. అయితే సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అనుపమ తనపై వచ్చిన ట్రోల్స్ గురించి స్పిందింది.
టిల్లూ స్క్వేర్ (Tillu Square) మొదటి షో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్లలో దుమ్ముదులుపుతోంది. విడులైన అన్ని ప్రాంతాల్లో హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మూవీ టీం సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో డైరెక్టర్, మేకర్స్, హీరోహీరోయిన్లు పాల్గొని హ్యాపీ ఫీల్ అయ్యారు. సినిమాను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు క్రతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)మాట్లాడుతూ.. ” సినిమాను సక్సెస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది.
అయితే సినిమా రిలీజ్ కు ముందు నన్ను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ నన్ను చాలా బాధపెట్టాయి. చాలా మంది టిల్లూ స్క్వేర్ లో నా లుక్‌ని చూసి జడ్జ్ చేశారు. అసలు నేను లిల్లీ క్యారెక్టర్ ఎందుకు చేశానో సినిమా చూస్తే తెలుస్తుంది. అలాంటిది పోస్టర్స్, ట్రైలర్ చూసే నన్ను జడ్జ్ చేశారు. చాలా మంది గ్లామర్ సీన్స్ అవసరమా అని అనన్ను క్వశ్చన్ చేశారు. ఆ ట్రోలింగ్స్ చూసి చాలా ఇబ్బంది పడ్డాను. సినిమా విడుదలయ్యాక ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని భయపడ్డాను.
ఈ ప్రెస్‌మీట్ వరకు నేను చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ మా టీం సినిమా హిట్ అనడంతో ఊపిరి పీల్చుకున్నాను. లిల్లి క్యారెక్టర్ కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తకాలం పడ్డ శ్రమ అంతా మర్చిపోయాను. మా సినిమా చూసి డీజే టిల్లు హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) ఫోన్ చేసి చాలా బాగా చేశావ్ అని పొగిడింది.
ఇంతకు మించి నాకు ఏం కావాలి. లిల్లీ క్యారెక్టర్ కు వచ్చిన రెస్పాన్స్ ఈ క్రెడిట్ అంతా మా మూవీ బాయ్స్‌దే. వాళ్లందరికి చాలా చాలా థ్యాంక్స్ . మూవీ రిలీజ్ కు ముందు చాలా ఇబ్బందులు వచ్చాయి. కానీ వాటన్నింటి నుంచి నన్ను బయటకు తీసుకువచ్చారు. నాకు ధైర్యం ఇస్తూ లిల్లికి సపోర్ట్ గా నిలిచారు”. అని ఎమోషనల్ అయ్యింది అనుపమ.